Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. ద్రవిడ దిగ్గజాలు డీఎంకె, ఏఐఏడీఎంకేలకు గట్టి షాక్ ఇస్తూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ 108 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక, ఆ పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచేందుకు నటి త్రిష కృష్ణన్ చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి విచ్చేశారు. తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి ఇంటి నుంచి బయలుదేరి వచ్చారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూడటం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు త్రిష పేర్కొన్నారు.
ఈ వేడుకలో త్రిష నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయారు. బంగారు రంగు డిజైన్ ఉన్న చీర, దానికి జతగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి ఎంతో హుందాగా కనిపించారు. వజ్రాలు, కెంపులు పొదిగిన హారం, మల్లెపూలతో ఆమె అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక, విజయ్ రాజకీయ ప్రస్థానంలో త్రిష ఆది నుంచి మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరిగిన రోజున, తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆమె చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అప్పట్లోనే వైరల్ అయ్యింది. వారిద్దరి హిట్ చిత్రం ‘గిల్లీ’ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఉన్న ఆ పోస్ట్ విజయ్‌కు త్రిష ఇస్తున్న మద్దతుగా అభిమానులు భావించారు.
Also Read
- Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
- Beware Bachelors: పెళ్లి కావాల్సిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన వార్త! అందాల ఎర వేసి కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
- Ayodhya Ram Mandir: రామ మందిర్ ట్రస్ట్‌లో కలకలం.. చంపత్ రాయ్ వ్యాఖ్యలతో మళ్లీ వేడెక్కిన వివాదం
- CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
అంతేకాకుండా, మే 4న త్రిష పుట్టినరోజు, ఎన్నికల ఫలితాల రోజున తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విజయ్ పార్టీ ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె చేసిన ఈ పర్యటన చర్చనీయాంశమైంది. ఫలితాల అనంతరం చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లి స్వయంగా అభినందనలు సైతం తెలిపారు. విజయ్, త్రిషల జోడీకి తమిళ చిత్రసీమలో ప్రత్యేక క్రేజ్ ఉంది. గిల్లీ, తిరుపాచ్చి, ఆతి, కురువి, గత ఏడాది వచ్చిన ‘లియో’ వంటి చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.
తాజావార్తలు
-
Vivo V80: వివో V80 Series ధర లీక్.. 7200mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 4తో భారత్‌లో త్వరలో లాంచ్?
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
Shravana Maasam: శ్రావణ మాస మహోత్సవం.. జూలై 30నా లేక 31నా? శివయ్య భక్తులు నోట్ చేసుకోవాల్సిన పవిత్ర తిథులు ఇవే!
-
Suriya Remuneration: ‘కరుప్పు’ సక్సెస్‌తో 100 కోట్ల క్లబ్‌లోకి సూర్య?
-
Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!