Triple Talaq: ఢిల్లీలోని ఘజియాబాద్‌లో మరో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగు చూసింది. కారు కట్నంగా ఇవ్వలేదని పోన్ లో త్రిపుల్ తలాక్ చెప్పాడు. అంతేకాకుండా మరో మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో భార్య .. భర్త, అతని తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Bandaru Satyanarayana Murthy: వైసీపీ చేస్తోంది గర్జన కాదు.. పిల్లి కూత, కుక్క అరుపు
ఘజియాబాద్‌లోని కైలా భట్టాకు చెందిన ఇమ్రాన్, రుబీనాను 2017లో వివాహం చేసుకున్నాడు. వారి ప్రేమకు గుర్తుగా నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ముందు ఆనందంగా సాగిన వారికాపురంలో అదనపు కట్నం గొడవ మొదలైంది. అదనపు కట్నంగా కారు కావాలంటూ భర్త భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఆమె అందుకు ఆంగీకరించలేదు. భర్తతో పాటు అత్తమామలు కూడా అమెను చిత్రహింసలు గురిచేస్తుండేవారు. విసిగి పోయిన రుబీనా పుట్టింటికి కూడా వెళ్లకుండా మరో అద్దె ఇంటిని తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. అయినా వదలని భర్త ఆమె వుంటున్న అద్దె ఇంటికి వచ్చి భార్యపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపరచారు. చివరికి ఆమె పుట్టింటికి వెళ్లి బంగారు ఆభరణాలు తీసుకువచ్చి అతనికి ఇచ్చింది. అయినా అతనికి వరకట్న దాహం తీరలేదు. ఇటీవల ఉద్యోగంపై రాజస్థాన్ వెళ్లిన భర్త ఇమ్రాన్ ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అక్కడే మరో మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. రుబీనా తన భర్తతో సహా తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
LVM3 Rocket: 36 ఉపగ్రహాలతో నింగిలోకి ఎగిరేందుకు ఎల్వీఎం3 సిద్ధం