PM Modi: “రాష్ట్రపతిపై వ్యాఖ్యలు”.. సోనియా, రాహుల్ గాంధీలపై ప్రధాని మోడీ ఫైర్..
- రాష్ట్రపతిపై సోనియా గాంధీ వ్యాఖ్యల వివాదం.. కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీఎం మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ ప్రసంగంపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పెదవివిరిచాయి. అయితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ద్వారకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ, సోనియా గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన వర్గం నుంచి వచ్చిన రాష్ట్రపతిని అవమానించారని మండిపడ్డారు.
Read Also: Rashtrapati Bhavan: సోనియాగాంధీ వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్రపతి భవన్
Also Read
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
- PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల కాంగ్రెస్ నాయకత్వం అహంకారం, అగౌరవాన్ని ప్రదర్శిస్తోందని మోడీ ఆరోపించారు. ‘‘షాహి పరివార్(రాజకుటుంబం) అహంకారాన్ని చూడండి. గిరిజన నేపథ్యం నుంచి వచ్చి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముని అవమానించారు. షాహి కుటుంబ సభ్యుడు ఒకరు ప్రసంగాన్ని ‘‘బోరింగ్’’ అని అభివర్ణించారు. మరొకరు పాపం అంటూ గిరిజనులను అవమానించారు’’ అని సోనియా గాంధీ పేరుని నేరుగా ప్రస్తావించకుండా ప్రధాని విమర్శించారు.
రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రపతి చివరికి అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది, పాపం’’ అని సోనియా గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ‘‘బోరింగ్’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. రాజ్యాంగంగా అత్యున్నత పదవిని కాంగ్రెస్ అవమానించిందని, గిరిజనులపై కాంగ్రెస్ వైఖరిని ఇది స్పష్టం చేస్తుందని ఆరోపించింది. అయితే, తన తల్లి సోనియాగాంధీ వ్యాఖ్యలపై ఎంపీ ప్రియాంకా గాంధీ వివరణ ఇచ్చారు. ‘ నా తల్లి 78 ఏళ్ల మహిళ. రాష్ట్రపతి సుదీర్ఘ ప్రసంగం ద్వారా అలసిపోయినట్లు మాత్రమే చెప్పారు. రాష్ట్రపతిపై తమకు పూర్తి గౌరవం ఉందని, ఈ విషయాన్ని మీడియా వక్రీకరించడం దురదృష్టకరం’’ అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : గోవా ప్లస్‌గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్‌లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!