Site icon NTV Telugu

Trump-Modi: ట్రంప్ సుంకాలతో వచ్చే నష్టమేంటి? భారత్ ప్లాన్ ఏంటి?

Trumpmodi

Trumpmodi

భారత్‌‌పై ఏదో కోపం పెట్టుకున్నట్లుగానే ట్రంప్ వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కక్ష సాధింపులో భాగంగానే భారత్‌పై భారీగా సుంకాలు విధించినట్లుగా తెలుస్తోంది. ఆసియాలో ఒక్క భారత్‌పైనే భారీగా సుంకం విధించారు. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగానే ట్రంప్ ఇలా వ్యవహరిస్తున్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆగస్టు 27 నుంచి భారత్‌పై 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామని భారత ప్రభుత్వం చెబుతున్నా.. ప్రభావం మాత్రం ఎక్కువగానే ఉంటుందని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చింది. దీంతో అమెరికాతో వాణిజ్య చర్చలు జరగాల్సి ఉందని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: US: ట్రంప్‌ను చంపేయండి.. విద్యార్థులపై కాల్పులు జరిపిన నిందితుడి తుపాకీపై రాతలు

భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు ప్రస్తుతం పరిమితంగా అనిపించవచ్చు కానీ ఆర్థిక వ్యవస్థపై మాత్రం ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక నివేదికలో తెలిపింది. తప్పనిసరిగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగాల్సి ఉంటుందని పేర్కొంది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నెలవారీ ఆర్థిక సమీక్ష తెలిపింది. 50 శాతం భారీ సుంకం కారణంగా 48 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎగుమతులపై ప్రభావం చూపునున్నట్లు తెలుస్తోంది. వస్త్రాలు/దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తోలు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, యాంత్రిక యంత్రాలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోడీ కారణంగానే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపడం లేదని అమెరికా పదే పదే ఆరోపిస్తోంది. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం ఆపేస్తే.. రష్యా దిగొస్తుందని అంటోంది.

Exit mobile version