Site icon NTV Telugu

Modi-Trump: భారత్-అమెరికా మధ్య శుభపరిణామం.. త్వరలోనే వాణిజ్య చర్చలు

Modi9

Modi9

భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం వెలువడుతోంది. భారీగా సుంకం విధించడంతో ఇరు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రంప్ కీలక పోస్ట్ చేశారు. భారత ప్రధాని మోడీ తనకు చాలా మంచి స్నేహితుడని.. మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెనువెంటనే మోడీ కూడా రిప్లై ఇచ్చారు. తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. రెండు దేశాల భాగస్వామ్యం చాలా గొప్పదిగా అభివర్ణించారు.

ఇది కూడా చదవండి: KP Sharma Oli: 24 గంటలుగా కనిపించని నేపాల్ మాజీ ప్రధాని ఓలి ఆచూకీ.. ఏదైనా జరిగిందా?

ఈ పరిణామాల నేపథ్యంలో తిరిగి భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం అవుతాయని వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఐదు రౌండ్ల చర్చలు జరిగాయి. ఆరవ రౌండ్ చర్చలు త్వరలోనే జరుగుతాయని అధికార వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈసారి చర్చలు జరిగితే ఢిల్లీలోనే జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Nepal: మహిళా మంత్రిపై మూకుమ్మడి దాడి.. వెలుగులోకి వచ్చిన భయానక దృశ్యాలు

పాడి, వ్యవసాయంపై అమెరికా రాయితీలు కోరుతోంది. కానీ ఈ రెండు కూడా భారతదేశానికి జీవనాడి. ఈ నేపథ్యంలో రాయితీలు ఇచ్చేందుకు భారత్ మొగ్గు చూపడం లేదు. దీంతో చర్చలు ప్రతిష్టంభన చోటుచేసుకున్నాయి. కొత్త చర్చలు అక్టోబర్‌లో జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అన్నదాతలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా.. ఒప్పుకోకూడదని భారత్ భావిస్తోంది. చౌకైన అమెరికా వస్తువులు దిగుమతి అయితే భారతీయ పాడి, వ్యవసాయం దెబ్బతింటోందని భారత్ ఆలోచిస్తోంది.

మొక్కజొన్న, సోయాబీన్స్, ఆపిల్, బాదం, ఇథనాల్ వంటి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే ప్రతిపాదనలను కూడా భారతదేశం తోసిపుస్తోంది. అనుమతిస్తే భారత రైతులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఢిల్లీ భావిస్తోంది. ఒకవేళ అమెరికా నుంచి సానుకూల నిర్ణయం లేకపోతే భారత్ దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. అయినా కూడా రాత్రికి రాత్రే విభేదాలు పరిష్కరించబడవని ఒక సీనియర్ అమెరికా అధికారి అన్నారు.

భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా ట్రంప్ మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. దీంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే అన్నదాతల కోసం ఎంత భారమైనా భరిస్తామని మోడీ ప్రకటించారు.

 

 

Exit mobile version