Indira Gandhi’s birth anniversary: ఇందిరాగాంధీ మనదేశానికి మొట్టమొదటి మహిళ ప్రధాని ఈమె. అంతే కాదు ఏకైక మహిళ ప్రధాని కూడా ఈమె. ఈమె తరువాత ఇప్పటి వరకు మరో ఏ మహిళ ప్రధానిగా చెయ్యలేదు. కాగా నేడు ఇందిరాగాంధీ జయంతి. ఈ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, సోనియా, రాహుల్ ఆమెకు నివాళులు అర్పించారు. వివరాలలోకి వెళ్తే.. ఈరోజు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా X వేదికగా ఇందిరాగాంధీకి నివాళులు అర్పించారు. భారతదేశ దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి నివాళులు అని X లో పోస్ట్ చేశారు. అలానే ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదివారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా శక్తి స్థల్‌లో పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Read also:Tamilnadu : వేలూరులో దారుణం..బైక్ పై స్పీడుగా వెళ్లాడని దళిత వ్యక్తులను కొట్టిన ముఠా..
కాగా పలువురు సీనియర్ నాయకులు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తదితరులు కూడా దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనం ఇందిరాగాంధీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇందిరాగాంధీ నవంబర్ 19 వ తేదీ 1917 లో జన్మించారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ఆమె ప్రధానమంత్రి అయిన ఈమె 1977 వరకు విధులు నిర్వహించారు. అనంతరం జనవరి 1980లో మరోసారి ప్రధానిగా ఎంపికై 1984లో హత్యకు గురయ్యే వరకు విధులు నిర్వహిచారు. ఈమెను 1984 లో ఆమె గన్ మాన్ గన్ తో కాల్చి చంపారు.