Site icon NTV Telugu

BRS Central Office: నేడే బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం.. మధ్యాహ్నం ముహూర్తం

Kcr

Kcr

BRS Central Office: ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 12.47 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ముందుగా జెండాను ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేసీఆర్ తన ఛాంబర్‌ కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ సెంటర్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనాలని ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలందరినీ పార్టీ అధినేత ఆహ్వానించారు కేసీఆర్ ఢిల్లీకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Read also: Congo: కాంగోలో వరద విలయం.. 120 మంది దుర్మరణం

ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకోనున్నారు. పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాల నిమిత్తం ఆయన 17వ తేదీ వరకు ఢిల్లీలోనే ఉంటారు. ఇప్పటికే తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో శాసన సభల ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కా నేత, కిసాన్ కీ భరోసా, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Read also: Uttar Pradesh: అంత్యక్రియలకు డబ్బు లేక రోజుల తరబడి తల్లి మృతదేహంతోనే..

తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఆ తర్వాత భారతీయ రాష్ట్ర సమితి (BRS)గా జాతీయ పార్టీగా అవతరించింది. పార్టీ పేరు మార్పు విషయమై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఈసీ లేఖ రాసింది. ఈ సందర్భంగా లేఖపై కేసీఆర్ సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. గులాబీ జెండా మధ్యలో భారతదేశం చిత్రీకరించబడింది. పార్టీ జెండా రంగు, గుర్తు మారలేదు. 22 ఏళ్ల టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Aatma Bandhuvu: ఆరు పదుల ‘ఆత్మబంధువు’

Exit mobile version