భారత్‌లో తగ్గినట్టే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. రోజువారి కేసుల సంఖ్య ఇప్పుడు 40 వేల వైపు పరుగులు తీస్తోంది.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 35,662 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూవాయి.. మరో 281 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 33,798 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు దేశ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,17,390కు చేరుకోగా.. రికవరీ కేసులు 3,26,32,222కి పెరిగాయి.. ఇక, కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 4,44,529 మంది మృతిచెందగా.. ప్రస్తుతం దేశంలో 3,40,639 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు.