ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 31,443 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,05,819 కి చేరింది. ఇందులో 3,00,63,720 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,31,315 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2,020 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,10,784 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 49,007 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.