Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
- ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టు టీఎంసీ..
- కౌంటింగ్ విధుల్లో కేంద్ర ఉద్యోగులు నియామకానికి వ్యతిరేకంగా పిటిషన్..
- రేపు సుప్రీంకోర్టు విచారణకు వచ్చే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Elections: దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉంది. కౌంటిక్ ముందు మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మే 4న జరిగే ఓట్ల లెక్కింపులో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తప్పించడంపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అ పిటిషన్‌ను అత్యవసరం విచారించాలని టీఎంసీ సుప్రీంకోర్టును కోరింది. అయితే ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును శనివారం విచారణకు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమచారం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంతకుముందు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు, పోలీసులు టీఎంసీ కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.
Also Read
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
ఇటీవల, పశ్చిమ బెంగాల్ అదనపు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఒక ప్రకటనలో.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఉండే కౌంటింగ్ సూపర్వైజర్ లేదా కౌంటింగ్ అసిస్టెంట్లలో కనీసం ఒకరు కేంద్ర ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) ఉద్యోగి అయి ఉండాలని చెప్పారు. అయితే, ఇలాంటి ఉత్తర్వులను ఎన్నికల సంఘం మాత్రమే జారీ చేయగలదని, అదనపు సీఈఓ కాదని వాదిస్తూ టీఎంసీ ఈ ఆదేశాన్ని సవాలు చేసింది.
Read Also: Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..
ఎన్నికల హ్యాండ్ బుక్ ప్రకారం కౌంటింగ్ సిబ్బంది కేంద్ర ఉద్యోగులే ఉండాలని ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. మైక్రో అబ్జర్వులు మాత్రం సాధారణంగా కేంద్ర సర్వీస్ నుంచి వస్తారని, కానీ కౌంటింగ్ సిబ్బందికి ఈ నిబంధనలు వర్తింపచేయడం అన్యాయమని టీఎంసీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ ప్రభావానికి లోనయ్యే అవకావం ఉందని, ఇది సమాన పోటీకి విఘాతం కలిగిస్తుందని టీఎంసీ ఆరోపించింది.
అయితే, టీఎంసీ ఈ వాదనను అంతకుముందు కలకత్తా హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కేంద్ర లేదా రాష్ట్ర ఉద్యోగుల్ని నియమించుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి భద్రతా చర్యలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజావార్తలు
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!