US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US War Cost in Iran: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో గత 100 రోజులకు పైగా సాగుతున్న భీకర పోరాటానికి తెరపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు జరిపిన దాడితో మొదలైన ఈ యుద్ధం వల్ల అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని స్థాయిలో భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. దాదాపు 108 రోజుల పాటు సాగిన ఈ సైనిక చర్యల కోసం అమెరికా కేవలం రక్షణ రంగం పరంగానే సుమారు 113 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 10.67 లక్షల కోట్లు) ఖర్చు చేయాల్సి వచ్చింది.
సైనిక, రక్షణ వ్యయాల లెక్కలు:
అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) వెల్లడించిన వివరాల ప్రకారం.. యుద్ధం ప్రారంభమైన మొదటి ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 11.3 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. అంటే సగటున రోజుకు 1.88 బిలియన్ డాలర్లు అన్నమాట. ఆ తర్వాత రోజువారీ యుద్ధ వ్యయం సగటున 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,447 కోట్లు) గా నమోదైంది. ఫిబ్రవరి 28 నుంచి జూన్ 16 వరకు జరిగిన పరిణామాల ఆధారంగా ఈ అంచనా వేశారు. యుద్ధం ప్రారంభ దశలోనే ఇరాన్‌కు చెందిన ‘షాహెద్’ డ్రోన్లను కూల్చివేయడానికి అమెరికా అత్యంత ఖరీదైన పేట్రియాట్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో ఒక్కో క్షిపణి ధర 40 లక్షల డాలర్లు. కేవలం క్షిపణులు, మందుగుండు సామాగ్రి కోసమే ప్రారంభంలోనే 25 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. వీటికి తోడు పర్షియన్ గల్ఫ్ రీజియన్‌లో భారీగా మోహరించిన సైనికుల నిర్వహణ కోసం రోజువారీ ఖర్చులు అదనంగా భరించాల్సి వచ్చింది.
Also Read
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
- IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
అమెరికాపై పడిన మొత్తం ఆర్థిక భారం:
పలువురు ఆర్థిక నిపుణులు, విమర్శకుల అభిప్రాయం ప్రకారం.. అధికారికంగా చూపించిన 113 బిలియన్ డాలర్ల సైనిక వ్యయం చాలా తక్కువ. ఇందులో అమెరికా పరోక్షంగా ఎదుర్కొన్న ఆర్థిక నష్టాలను సైతం కలిపితే మొత్తం భారం 1 ట్రిలియన్ డాలర్ల (రూ.9.43 లక్షల కోట్లు) కు చేరుకుంటుంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో కేవలం అమెరికా పౌరులే దాదాపు 40 బిలియన్ డాలర్ల అదనపు భారాన్ని మోయాల్సి వచ్చింది. అయితే, డెమొక్రాటిక్ నాయకులు, ప్రముఖ ఆర్థికవేత్తల అంచనా ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు, అక్కడి ప్రజలకు జరిగిన అసలు నష్టం 630 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
ఇరాన్‌కు భారీ పరిహారం:
ఈ శాంతి ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం ఇరాన్‌కు చెల్లించాల్సిన నష్టపరిహారం. యుద్ధంలో ఇరాన్ వ్యాప్తంగా ధ్వంసమైన మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు), పవర్ గ్రిడ్ల పునర్నిర్మాణం కోసం సుమారు 300 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒప్పందం ప్రకారం ఈ 300 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇరాన్‌కు ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. అయితే ఈ నిధులు గల్ఫ్ దేశాల (మిత్రదేశాల) నుంచి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దీనితో పాటు, విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను సైతం పూర్తిగా విడుదల చేయనున్నారు. ఏదేమైనా, ఈ యుద్ధం వల్ల అటు పశ్చిమాసియా ఛిన్నాభిన్నమవ్వడమే కాకుండా, ఇటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా కోలుకోలేని దెబ్బ తగిలిందని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!