TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- మమతా బెనర్జీకి మరో షాక్..
- కోల్‌కతాలో పార్టీ కార్యాలయానికి తాళం వేసిన రీటబ్రత వర్గం..
- తమదే అసలైన టీఎంసీ అంటూ నేతల నినాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC: మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సంక్షోభం మరింత తీవ్రమైంది. టీఎంసీకి చెందిన రీటబ్రత వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆక్రమించుకుంది. రీటబ్రత బెనర్జీ కార్యాలయానికి తాళం వేసి, తాళాలు తీసుకెళ్లారు. తమదే నిజమైన టీఎంసీ అని ఆ వర్గం నేతలు ప్రకటించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మెట్రోపాలిటన్ ఈఎం బైపాస్‌లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి సమావేశం నిర్వహించారు. రీటబ్రత వర్గం నేతలు తమదే నిజమైన టీఎంసీ అంటూ పార్టీ కార్యాలయం ముందు పోస్టర్లు అంటించారు.
శుక్రవారం రీటబ్రత బెనర్జీ, ఫిర్హాద్ హకీం, సందీపన్ సాహా, జావేద్ ఖాన్, అఖ్రుజ్జమాన్, పలువురు ఇతర నాయకులు మెట్రోపాలిటన్ ఈఎం బైపాస్‌లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. పార్టీ ప్రధాన ద్వారా వద్ద మమతా బెనర్జీ, అరూప్ రాయ్‌ల చిత్రాలతో కూడా ఒక పోస్టర్ కూడా ఏర్పాటు చేశారు. రీటబ్రత వర్గం ఇటీవల మమతను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, అరూప్ రాయ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించుకుంది. ఈ వర్గం మమతా బెనర్జీని తమ సలహాదారుగా పేర్కొంటోంది. సమావేశం తర్వాత పార్టీ కార్యాలయ తాళాలను రీటబ్రత వర్గం తమ వెంట తీసుకెళ్లారు.
Also Read
- Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
- PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
ఈ పరిణామాలపై మమత వర్గం తీవ్రంగా స్పందించింది. తిరుగుబాటు నేతలకు పార్టీ కార్యాలయంతో ఎలాంటి సంబంధం లేదని, వారి వాదనలకు చట్టబద్ధత లేదని ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. వారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపిస్తూ, చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని స్పష్టం చేశారు. పార్టీ నుంచి బహిష్కరించబడిన వ్యక్తులకు ఎన్నికల సంఘం ఎలా అపాయింట్మెంట్ ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే, అసలైన టీఎంసీ ఎవరిదనే వాదనల నేపథ్యంంలో ఎన్నికల సంఘం ఇరు వర్గాలను జూలై 6 సాయంత్రం లోగా పత్రాలను, వాదనల్ని సమర్పించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
‘Panchanama’ Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
-
Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
-
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!