New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
- కొత్త ప్రపంచపటానికి భారత్ మద్దతు..
- ఐక్యరాజ్యసమితి తీర్మానానికి భారత్ ఓటు..
- లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ విషయంలో వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New World Map: ప్రపంచ పటంలో వివిధ దేశాలు, ఖండాల భూభాగాలను వాటి పరిమాణానికి అనుగుణంగా చూపించేలా రూపొందించిన ఐక్యరాజ్యసమితి తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. అయితే, ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం ద్వారా ఏదైనా నిర్దిష్ట మ్యాప్ లేదా మ్యాప్ ప్రొజెక్షన్‌ను భారత్ ఆమోదించినట్లు కాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. సెప్టెంబర్ 4న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆఫ్రికాతో పాటు మరికొన్ని ప్రాంతాలను వాటి పరిమాణానికి అనుగుణంగా చూపించే వరల్డ్ మ్యాప్ తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ తీర్మాణంపై భారత్ అనుకూలంగా ఓటేసింది. సమాన-విస్తీర్ణ ప్రాతినిధ్యం అనే ప్రాథమిక సూత్రానికి భారత్ మద్దతు తెలిపిందని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. రాజకీయ కార్టోగ్రఫీ, వివాదాస్పద భూభాగాలు, సరిహద్దులు, ప్రాంతాల పేర్లపై తీర్మానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లపై భారత్ కఠిన వైఖరిని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌తో సహా భారత సార్వభౌమ భూభాగాన్ని దేశ అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని జైస్వాల్ అన్నారు. తప్పుగా లేదా తప్పుదారి పట్టించే విధంగా చిత్రీకరించడాన్ని భారత్ అంగీకరించదని స్పష్టం చేశారు. భారత సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై తమ వైఖరి స్పష్టమైనదని, స్థిరమైనదని చెప్పారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ఐక్యరాజ్యసమితి ‘‘కరెక్ట్ ద మ్యాప్’’ తీర్మానం ఏంటి..?
ప్రస్తుతం వరల్డ్ మ్యాప్‌కు మూలం 1569లో రూపొందించిన మెర్కేటర్ ప్రొజెక్షన్. ఇది నావిగేషన్‌కు ఉపయోగంగా ఉన్నప్పటికీ. భూమధ్య రేఖకు దూరంగా ఉన్న ప్రాంతాలను వాటి వాస్తవ విస్తీర్ణం కన్నా పెద్దగా చూపిస్తుంది. దీంతో ఆఫ్రికా వంటి భూమధ్య రేఖ సమీపంలో ఉన్న ప్రాంతాలు ఉత్తరార్థగోళంలో ఉన్న కొన్ని ప్రాంతాల భూభాగాల కన్నా చిన్నగా కనిపిస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘‘ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్’’ భూభాగాల విస్తీర్ణాన్ని ప్రపంచపటంలో మరింత ఖచ్చితంగా చూపించేలా రూపొందించారు. 2018లో డెవలప్ చేసిన ప్రొజెక్షన్ ఆఫ్రికా పరిమాణం మెర్కేటర్లో ఆఫ్రికా పరిమాణం కన్నా పెద్దగా కనిపిస్తుంది. ఈ తీర్మానానికి 164 దేశాలు అనుకూలంగా ఓటేయగా, ఆరు దేశాలు గైర్హాజరయ్యాయి. అమెరికా దీనికి వ్యతిరేకంగా ఓటేసింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?