PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
- SRCC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం.
- ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యను మరోసారి ప్రస్తావించిన మోదీ.
- ఆ పదాన్ని హోమియోపతి పిల్‌తో పోల్చిన ప్రధాని.
- ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తూనే, ఇటీవల ఆందోళన, నిరసనల విషయంలో కూడా పరోక్షంగా స్పందించారు. ముఖ్యంగా యువత, జెన్-జీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశాభివృద్ధిపై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మరోసారి మోడీ ‘‘దిమాగీ నక్సల్స్’’ పదాన్ని ఉపయోగించారు. ఇటీవల ఎర్రకోటపై నుంచి మోడీ మాట్లాడుతూ.. దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని ఉపయోగించారు.
‘‘ఎర్రకోట నుంచి నేను ‘దిమాగీ నక్సల్’ అనే హోమియోపతి పిల్ ఇచ్చాను. హోమియోపతిలో చికిత్స ప్రారంభించినప్పుడు మొదట్లో వ్యాధి తీవ్రత పెరిగినట్లు కనిపిస్తుంది. అదే విధంగా నేను ‘దిమాగీ నక్సల్’ పిల్ ఇవ్వగానే ఒక్కొక్కరుగా బయటకు రావడం ప్రారంభించారు. ఇప్పుడు వారిని ప్రోత్సహిస్తున్నవారి నిజస్వరూపాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు’’ అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. SRCCలో 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను చేసిన ప్రసంగాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. 13 ఏళ్ల తర్వాత ప్రధాని హోదాలో మళ్లీ వచ్చిన తర్వాత అప్పటికీ, ప్రస్తుత భారత్‌కు తేడాలను విద్యార్థుల ముందుంచారు.
Also Read
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
కేదార్నాథ్ విషాదాన్ని, 2008 ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించారు. కేదార్నాథ్ విపత్తు సమయంలో అప్పటి ప్రభుత్వం తడబడిందని విమర్శించారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేదని, బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైందని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి పశ్చిమాసియా సంక్షోభం వరకు ప్రతీ అంశాన్ని విద్యార్థుల ముందుంచారు. అనేక ప్రపంచ సంక్షోభాల సమయంలో భారత్ అద్భుతంగా మనుగడ సాధించిందని చెప్పారు. జెన్-జీతో కనెక్ట్ అయ్యేలా ప్రధాని మోడీ వారి భాషలోనే మాట్లాడారు. వారిని ఆకట్టుకునేందుకు జెన్-జీ పదాలను ఉపయోగించారు.
తాజావార్తలు
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!