తినే ఫుడ్‌పై కూడా ఆంక్షలు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.. అయితే, ఓ వర్గం నడిపే హోటళ్లలో మరో వర్గాన్ని టార్గెట్ చేసి.. వారి శృంగార సామర్థ్యం క్రమంగా దెబ్బతినే విధంగా.. సంతానం కూడా కలగకుండా ఉండేలా.. కొన్ని దినుసులు వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.. సోషల్ మీడియాలోనూ ఆ వర్గం నడిపే హోటళ్లలో బిర్యానీ కానీ, ఇతర తినుబండారాలు కొనగోలు చేయొద్దు, తినొద్దు అంటూ ప్రచారం చేసేవాళ్లు లేకపోలేదు.. అయితే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత, కుచ్‌బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్ ఘోష్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.. బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలతో పురుషుల్లో శృంగార కోరికలు క్రమంగా తగ్గిపోతున్నాయని పేర్కొన్న ఆయన.. కుచ్‌బెహార్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు బిర్యానీ హోటళ్లను మూసివేయించడం చర్చగా మారింది..
Read Also: Maharashtra Political Crisis: 22 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి..! సీఎం ఏక్‌నాథ్ షిండేకు ఎసరు…?
ఇక, రెండు బిర్యానీ సెంటర్లను బలవంతంగా మూసివేయించిన తర్వాత రవీంద్రనాథ్ ఘోష్ మాట్లాడుతూ.. కుచ్‌బెహార్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా షాపులు నడుపుతున్నారు.. కోల్‌కతా బిర్యానీ షాపులకు పోటీగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి షాపులు పెట్టారు.. వారు చేసే బిర్యానీ తినడం వల్ల శృంగార సామర్థ్యం తగ్గుతుందని ఫిర్యాదులు వచ్చాయి.. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎలాంటి అనుమతులు లేకుండా బిర్యానీ షాపులు ఏర్పాటు చేస్తున్నారని.. వాటిపై ఫిర్యాదులు కూడా అందడంతో మూసివేయిస్తున్నామని తెలిపారు.. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంలో గతంలో మంత్రిగా పనిచేసిన రవీంద్ర నాథ్.. బిర్యానీ చేయడానికి ఉపయోగించే పదార్థాలు మరియు మసాలాలు పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని తగ్గించాయని చాలా మంది నుండి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.. ఒక వ్యక్తి యొక్క లైంగిక కోరికను నిరోధించే బిర్యానీని తయారు చేయడానికి ఏ మసాలాలు ఉపయోగిస్తున్నారో తమకు తెలియదని.. కానీ, ఆ ప్రాంత ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినందునే ఈ చర్యకు పూనుకున్నట్టు వెల్లడించారు.. మొత్తంగా అధికార పార్టీ నేత తీరు వివాదాస్పదంగా మారింది.