Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
- టీఎంసీలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం
- అన్ని కమిటీలు, అనుబంధ సంస్థలను రద్దు చేసిన మమత
- పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా మార్చనున్న టీఎంసీ
- అంతర్గత తిరుగుబాటు నేపథ్యంలో కీలక నిర్ణయం
- 16 అనుబంధ సంస్థలపై ఒకేసారి వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trinamool Congress: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో ఉంది. పార్టీ సుప్రీమో మమతా బెనర్జీ మాట కూడా ఎమ్మెల్యేలు వినడం లేదు. మరోవైపు, మమత నుంచి పార్టీని, పార్టీ గుర్తును చేజిక్కించుకునే ప్రయత్నాల్లో రెబల్ ఎమ్మెల్యేల ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పిలుపు ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. మంగళవారం కోల్‌కతాలో జరిగిన ధర్నాకు మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకు కేవలం ఐదుగురే హాజరు కావడం సంచలంగా మారింది. రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ రెబల్ వర్గం దీదీకి ఎదురుతిరుగుతోంది.
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీకి చెందిన అన్ని కమిటీలు, దాని అనుబంధ సంస్థల్ని తక్షణమే రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని టీఎంసీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పార్టీ అన్ని స్థాయిల్లో సమగ్రమైన ఆత్మపరిశీలన, పనితీరు సమీక్ష, సంస్థాగత సమీక్ష ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పింది. దీని తర్వాత కమిటీలను పునర్నిర్మించి, తగిన సమయంలో ప్రకటిస్తామని చెప్పింది.
Also Read
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
అయితే, అసెంబ్లీ ఎన్నికత తర్వాత టీఎంసీ అగ్రనాయకత్వంలో చీలిక ఏర్పడిందని తెలుస్తోంది. అనుబంధ సంస్థలు హైకమాండ్ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని కమిటీలను రద్దు చేసినట్లు తెలిసింది. టీఎంసీకి సుమారు 16 అనుబంధ సంస్థలు ఉన్నాయి. పార్టీలోని యువత, మహిళలు, విద్యార్థులు, కార్మికులు మొదలైన వివిధ విభాగాలకు సంబంధించిన అనుబంధ విభాగాలు ఉ న్నాయి. ఇక కమిటీల విషయానికి వస్తే టీఎంసీకి ఒక ప్రధాన కార్యనిర్వాహక కమిటీ ఉంది. దీనికి తోడుగా కోర్ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా, బ్లాక్ కమిటీలు, క్రమశిక్షణా కమిటీ ఉన్నాయి. సంక్షోభం నేపథ్యంలో తృణమూల్ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!