Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
- తృణమూల్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్..
- ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ..
- బీజేపీ నేతలతో భేటీ అయిన 14 మంది టీఎంసీ ఎంపీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇండియా కూటమి కీలక సమావేశంలో పాల్గొన్న సమయంలోనే, తృణమూల్ ఎంపీలు తిరుగుబాటు చేసి, బెంగాల్ సీఎం సువేందు అధికారితో భేటీ అయినట్లు తెలుస్తోంది. 14 మంది టీఎంసీ బీజేపీ నాయకుడు భూపేంద్ర యాదవ్ ఇంటిలో సమావేశమయ్యారు. 14 మంది లోక్‌సభ ఎంపీలు ఈ బీజేపీతో టచ్‌లోకి వెళ్లడం మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికే, టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది ఇప్పటికే రీటబ్రత బెనర్జీ క్యాంపులో ఉన్నారు. మమతా బెనర్జీని ధిక్కరించి వ్యవహరిస్తున్నారు.
సోమవారం ఢిల్లీకి సువేందు అధికారి వచ్చారు. మరోవైపు, ఢిల్లీలోనే ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మమతా బెనర్జీ హాజరయ్యారు. ఈ క్రమంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సర్వత్రా ఆసక్తిని పెంచుతున్నాయి. 14 మంది ఎంపీలతో జరుగుతున్న సమావేశంలో సువేందుతో పాటు భూపేంద్ర యాదవ్, త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేబ్ కూడా ఉన్నారు.
Also Read
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
- Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
దీనికి ముందు, సోమవారం ఉదయం ఐదుగురు తృణమూల్ ఎంపీలు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇంట్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత బెంగాల్ సీఎం సువేందు కూడా ఆయన నివాసానికి వెళ్లారు. మరోవైపు, టీఎంసీ రాజ్యసభ ఎంపీ, చీఫ్ విప్‌గా ఉన్న సుఖేందు శేఖర్ రాయ్ తన ఎంపీ పదవితో పాటు, టీఎంసీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సీనియర్ టీఎంసీ నేత రాజీనామా చేయడం మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. టీఎంసీకి చెందిన 29 లోక్‌సభ ఎంపీల్లో 14 మంది బీజేపీ వైపు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టీఎంసీకి 13 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయడంతో మరికొందరు కూడా ఆయన బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, టీఎంసీకి రాజీనామా చేసిన సుఖేందు శేఖర్‌ను ఢిల్లీలో ఐదుగురు టీఎంసీ ఎంపీలు కలిశారు. ఈ సమావేశంలో బుర్ద్వాన్ ఈస్ట్ ఎంపీ షర్మిలా సర్కార్, హౌరా ఎంపీ ప్రసూన్ బెనర్జీ, కూచ్ బెహార్ ఎంపీ జగదీష్ బసునియా, ఝార్గ్రామ్ ఎంపీ కాళిపద్ సోరెన్, బంకురా ఎంపీ అరూప్ చక్రవర్తి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!