Threatening Letter: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని మోడీనగర్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో ఉన్న మసీదుకు బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేపుతుంది.
Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఆయనకు బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై కిచ్చా సుదీప్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌ను బెదిరిస్తూ లేఖ రావడం కలకలం రేపింది. రూ.50 కోట్లు ఇవ్వాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆగంతుకుడు అందులో డిమాండ్ చేశాడు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో యాత్ర'ను నవంబర్ 28న ఖాల్సా స్టేడియంలో షెడ్యూల్ చేస్తే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో బాంబు పేలుళ్లు జరుగుతాయని అజ్ఞాత లేఖ రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.