Kerala Lulu Mall: 50% డిస్కౌంట్.. సునామీలా దూసుకొచ్చిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేస్తారనే నానుడి ఇప్పటికీ ఉంది. రియాలిటీలో అది సాధ్యపడదు కానీ, దానికి తగినట్టు చాలా సందర్భాలే వెలుగు చూశాయి. ఏదైనా ఒక భారీ ఆఫర్ ప్రకటిస్తే చాలు.. జనాలు పోటెత్తిపోతారు. అప్పట్లో జియో సిమ్స్ అందుబాటులో వచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా జనాలు ఎలా ఎగబడ్డారో చూసే ఉంటారు. అంతెందుకు.. హైదరాబాద్‌లోనే కొన్ని షాప్స్‌లో ఫలానా డిస్కౌంట్స్ ప్రకటించినప్పుడు దండయాత్రలే చేశారు.
ఇప్పుడు కేరళలోని లులు మాల్లో అలాంటి దృశ్యాలే కనువిందు చేశాయి. మొత్తం నగరమంతా ఆ మాల్‌లోకి వచ్చినట్టు జనాలు పోటెత్తారు. ఇందుకు కారణం.. ఆ మాల్ 50% డిస్కౌంట్ ప్రకటించడమే! చిన్నదా – పెద్దదా, చౌకైనదా – ఖరీదైనదా అని తేడాల్లేకుండా.. ప్రతీ దాని మీద 50% ఆఫర్ ప్రకటించింది. అందుకో నిర్ణీత సమయం కేటాయించింది. 6వ రాత్రి రాత్రి 11:59 గంటల నుంచి మొదలుకొని, 7వ తేదీ తెల్లవారుజాము వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఆ మాల్ తెలిపింది. అంతే, ఈ ప్రకటన చూసిన జనాలు ఒక్కసారిగా మాల్‌పై ఎగబడ్డారు.
Also Read
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
- Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
గేట్లు తీయడమే ఆలస్యం.. డ్యామ్ నుంచి నీళ్లెలా పారుతాయో అలా జనాలు లోపలికి దూసుకొచ్చారు. పాపం, అక్కడ పని చేసే స్టాఫ్ వారిని అదుపు చేయలేక నానాతంటాలు పడ్డారు. కనీసం నిలబడేందుకు చోటు కూడా లేనంతా ఆ మాల్ జనాలతో నిండిపోయింది. మెట్లపై కూడా క్యూలు కట్టేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ట్విటర్లో తెగ వైరల్ అవుతున్నాయి. 50% ఆఫర్ కోసమే ఇంతలా జనాలొచ్చారా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యచకితులవుతున్నారు.
Remember iPhone launch queues ?
Here is our Kerala’s Lulu Mall sale queue at midnight:— Vijay Shekhar Sharma (@vijayshekhar) July 9, 2022
Thread on some videos from #Lulumall, cochin !!
Looked like the entire Kochi was in the mall. Reminded me of Saravana stores, chennaipic.twitter.com/AscmYHFljM
— Vineeth K (@DealsDhamaka) July 8, 2022
తాజావార్తలు
-
Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్‌స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Harbhajan Singh: “అస్సలు భయపడొద్దు”.. వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి?.. మాస్టర్ ప్లాన్ చెప్పిన హర్భజన్ సింగ్!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
ట్రెండింగ్
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!