BJP: రాహుల్‌గాంధీతో ధీరజ్ సాహు.. “దొంగల యాత్ర” అంటూ బీజేపీ నేత విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐటీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బుధవారం లిక్కర్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో గుట్టలుగుట్టలుగా నగదు బయటపడుతోంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో ఐటీ దాడుల్లో ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా లెక్కలో చూపని నగదు పట్టుబడింది.
అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన నివాస ప్రాంగణాల్లోనే భారీగా డబ్బు బటయపడుతుండటంతో బీజేపీ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ అమిత్ మాలవీయ శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీతో, ధీరజ్ సాహు ఉన్న వీడియోని ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు.
Also Read
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
Read Also: Success Story: వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు.. ఎవరీ ‘నిషా జగ్తియాని’?
‘‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిజానికి భారతదేశ దొంగలను కలిపే యాత్ర. కాంగ్రెస్ అంటే #CorruptionKiDukan. జార్ఖండ్‌లోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో దాదాపు రూ. 300 కోట్లు రికవరీ కావడమే దీనికి సజీవ సాక్ష్యం.’’ అని హిందీలో ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు అంతర్జాతీయ అవినీతి దినోత్సం, ఈ రోజు కరప్షన్ దుకాణం యజమాని పుట్టినరోజు కూడా, ఇది కేవలం యాదృచ్చికం’’ అంటూ పరోక్షంగా డిసెంబర్ 9 సోనియాగాంధీ తన పుట్టిన రోజు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
ఒడిశా, జార్ఖండ్ లోని ధీరజ్ సాహు ప్రాంగణంలో శనివారం పన్ను దాడులు కొనసాగాయి. ఇప్పటి వరకు రూ. 200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు బయటపడింది. శనివారం ఉదయం ఐటీ శాఖ రాంచీలోని ధీరజ్ సాహు ప్రాంగణంలో మరిన్ని బ్యాగుల్ని స్వాధీనం చేసుకోగా.. ఆ ప్రాంతంలో మద్యం ఫ్యాక్టరీల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న బంటీ సాహు ఇంట్లో 19 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.
राहुल गांधी की भारत जोड़ो यात्रा दरअसल भारत के चोरों को जोड़ने की यात्रा थी। कांग्रेस #CorruptionKiDukan है। झारखंड में कांग्रेस के राज्यसभा सांसद धीरज साहू के ठिकानों से बरामद लगभग 300 करोड़ रुपए इसका जीता-जागता प्रमाण है। pic.twitter.com/Sc7Pt2D7ZV
— Amit Malviya (@amitmalviya) December 9, 2023
తాజావార్తలు
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!