Jaishankar: నెహ్రూ భారత్‌ని కాదని చైనాకు శాశ్వత సభ్యదేశ హోదా కల్పించారు.. పటేల్ హెచ్చరికల్ని పట్టించుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో శాశ్వత సభ్య దేశంగా భారత్‌కి ముందుగా అవకాశం వచ్చిందని, అయితే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కారణంగా అది చైనాకు దక్కిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ ఛాంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి ముప్పు పొంచి ఉందని సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూని ఎలా హెచ్చరించారనే విషయాలను పంచుకున్నారు.
Read Also: Annamalai: డీఎంకే తమిళనాడుకి శత్రువు.. కోయంబత్తూర్ రోడ్ షోలో అన్నామలై..
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
నెహ్రూ ఇండియా కంటే ముందు చైనాకు యూఎన్ఎస్సీలో శాశ్వత సభ్యదేశంగా స్థానం కల్పించాలని అనుకున్నారని జైశంకర్ అన్నారు. 1950లో సర్దార్ పటేల్, నెహ్రూ మధ్య సమావేశం జరిగింది. దీంట్లో పటేల్ చైనా ముప్పు గురించి నెహ్రూని హెచ్చరించారు. ఈ రోజు మనం రెండు వైపు(పాకిస్తాన్, చైనా) నుంచి ముప్పు ఎదుర్కొంటున్నామని పటేల్ చెప్పారు. చైనీయులు ఏది మాట్లాడినా, వారి ఉద్దేశం మంచిది కాదని తాను భావిస్తు్న్నానని అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని, దీనిపై ఒక విధానాన్ని రూపొందించాలని పటేల్ హెచ్చరించారు. అయితే నెహ్రూ మాత్రం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు’’ అని జైశంకర్ అన్నారు.
‘‘ చైనీయులను మీరు అనవసరంగా అనుమానిస్తున్నారని నెహ్రూ, పటేల్‌తో అన్నారు. హిమాలయాల మీదుగా మనపై దాడి చేయడం అసాధ్యం. యూఎన్‌లో శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని చర్చ జరిగింది. అయితే, ఈ స్థానాన్ని ముందుగా చైనాకు ఇవ్వాలని అని నెహ్రూ చెప్పారు. కాబట్టి ఈ రోజు మనం మొదట భారత్ గురించి మాట్లాడుతున్నాం. ఒకప్పుడు చైనా గురించి మాట్లాడిన సందర్భం అది’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లవద్దని సర్దార్ పటేల్ వైఖరిని కూడా నెహ్రూ పట్టించుకోలేదని, గత దశాబ్ధ కాలంగా కేంద్రంలో బీజేపీ వారసత్వంగా వచ్చిన సమస్యలతో వ్యహరిస్తోందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?