Turkey: అప్పుడు మాల్దీవులు, ఇప్పుడు టర్కీ.. ఇండియా దెబ్బకు విలవిల..
- అప్పుడు మాల్దీవులు, ఇప్పుడు టర్కీ..
- భారత్ దెబ్బ ఎలా ఉంటుందో తెలిసి వస్తోంది..
- పాక్‌కి మద్దతు ఇచ్చిన టర్కీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey: చైనాకు మద్దతు ఇస్తూ భారత్‌కి వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుందో గతంలో మాల్దీవులకు తెలిసి వచ్చింది. చివరకు భారత్ శరణుజొచ్చింది. ప్రస్తుతం టర్కీ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, టర్కీ పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తూ వస్తోంది. దాడిలో చనిపోయిన బాధితులకు సంతాపాన్ని తెలపకపోగా, ఉగ్రవాదులపై భారత్ చేసిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ని తప్పుపట్టింది. అమాయక పాక్ పౌరులపై భారత్ దాడి చేస్తుందనే ఆరోపణలు చేసింది. ఇదే కాకుండా, పెద్ద ఎత్తున పాకిస్తాన్‌కి డ్రోన్లను అందించింది. ఈ డ్రోన్లతోనే పాక్ భారత్‌పై దాడికి పాల్పడినట్లు తర్వాత విచారణలో తేలింది.
Read Also: Telangana Govt: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది..
Also Read
ఇదిలా ఉంటే, ఇప్పుడు భారత ప్రజలు టర్కీపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఎక్స్‌లో టర్కీని బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ అవుతోంది. టర్కీ యాపిల్స్‌ని భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అయితే, ఇప్పుడు టర్కీ నుంచి వచ్చే యాపిల్స్‌ని పలువురు వ్యాపారులు బ్యాన్ చేస్తున్నారు. మహారాష్ట్రలో పూణేలోని యాపిల్ వ్యాపారులు టర్కీష్ యాపిల్స్ బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నాయి.
మరోవైపు, టర్కీ పర్యాటక శాఖ, భారతీయులు తమను బాయ్‌కాట్ చేయొద్దని వేడుకుంటోంది. మెజారిటీ టర్కీ ప్రజలకు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి తెలియదని, ఇండియన్ టూరిస్టులను ఆహ్వానిస్తున్నామని చెప్పింది. టర్కీ ట్రిప్‌లను క్యాన్సల్ చేసుకోవద్దని చెప్పింది. ఇవన్నీ చూస్తే టర్కీకి భారత్ దెబ్బ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. టర్కీ ముఖ్యంగా టూరిజంపై ఆధారపడి ఉంది. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భారతీయలు ఆ దేశానికి వెళ్తుంటారు. ఇప్పుడు టర్కీ పాకిస్తాన్‌కి మద్దతు ఇవ్వడంతో భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!