Maharashtra: డాక్టర్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు.. ఓ ఎంపీ ఏం చేశాడంటే..!
- సంచలన సృష్టిస్తున్న మహారాష్ట్రలో మహిళా వైద్యురాలి ఆత్మహత్య కేసు
- తాజాగా వెలుగులోకి సంచలన విషయాలు
- ఓ ఎంపీ ఏం చేశాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఓ మహిళా వైద్యురాలి (26) ఆత్మహత్య సంచలనంగా మారింది. సతారా జిల్లా ఆస్పత్రిలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసిపెట్టింది. ఎస్ఐ గోపాల్ బడ్నే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది. ఐదు నెలల్లో పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అతడి వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది.

Also Read
- Marco Rubio: భార్యతో కలిసి తాజ్‌మహల్, జైపూర్ ప్రసిద్ధ కట్టడాలు సందర్శించిన మార్కో రూబియో
- Padma Awards 2026: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. అవార్డు స్వీకరించిన హేమా మాలిని, కన్నీళ్లు పెట్టుకున్న కుమార్తె అహానా
- Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్‌వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
- Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
ఇక సూసైడ్ నోట్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఎంపీ, అతడి సహాయకుల నుంచి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయని ఆరోపించింది. ఇక వైద్య పరీక్షలకు తీసుకురాకుండానే నిందితులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ పోలీసులు పదేపదే తనపై ఒత్తిడి తెచ్చారని తెలిపింది. అందుకు నిరాకరించడంతో ఎస్ఐ గోపాల్ బడ్నేతో పాటు మరికొందరు పోలీసు అధికారులు తనను వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. ఇక ఎస్ఐ గోపాల్ బడ్నే తనపై ఐదు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడని.. పైగా మానసికంగా, శారీరకంగా హింసించాడని వాపోయింది. ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్‌పై కూడా ఇవే రకమైన ఆరోపణలు వైద్యురాలు చేసింది.
ఇది కూడా చదవండి: Osama bin Laden: ఆ సమయంలో లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నాడు.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి
సూసైడ్ నోట్ ఆధారంగా ఎస్ఐ గోపాల్ బడ్నే, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణలో ఎస్ఐ గోపాల్ బడ్నే-వైద్యురాలు బంధువులేనని తేలింది. బంధువు ముసుగులో ఎస్ఐ.. వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Machado: వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ.. నోబెల్ గ్రహీత మచాడో వెల్లడి
ప్రస్తుతం ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ కూటమి ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నామ్‌దేవ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌లో కీలక పోస్టు పెట్టారు. రక్షించాల్సి పోలీసులే.. వైద్యురాలిపై వేధింపులకు పాల్పడటాన్ని తప్పుబట్టారు. తొలుత ఆమె పై అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే పోలీసులను రక్షిస్తోందని.. అందుకే దురాగతాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఆరోపణలను బీజేపీ నాయకురాలు చిత్ర వాఘ్ ఖండించారు. ఇది సంఘటన దురదృష్టకరమని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Water Tank Cleaning : వాటర్ ట్యాంక్‌లో చేపల వాసన వస్తోందా? ఈ ట్రిక్ ట్రై చేయండి.!
-
Peddi : ‘పెద్ది’ ఐటం సాంగ్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది
-
ASUS VM441 AiO: ఆసుస్ నుంచి కొత్త AI డెస్క్‌టాప్.. ఆసుస్ VM441 AiO భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Family Planning : ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఈ టెస్టులు మస్ట్!
-
Vaibhav Vs Jaiswal: వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫ్లాప్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?