చెన్నై : తమిళనాడులో బయటపడ్డ అతి పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం బయటపడింది. అరియలూర్ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాలలో వేంకటేశ్వరుని విగ్రహం బయటపడింది. కారయంకురిచి గ్రామానికి చెందిన శరవణన్ స్థలంలో సుమారు ఎనిమిది అడుగుల రాతి స్వామివారి విగ్రహం దొరికింది. జెసిబి సహాయంతో విగ్రహాన్ని వెలికి తీశారు అధికారులు. విగ్రహన్ని బయటకు తీయగానే.. ఆ గ్రామస్థులు పూజలు నిర్వహించారు.
read more : మరోసారి పెరిగిన పెట్రో ధరలు : హైదరాబాద్ లో ఎంతంటే ?
అంతేకాదు.. ఈ పురాతన విగ్రహాన్ని తిరుచ్చి లోని పురావస్తు శాఖ కార్యాలయానికి తరలించడానికి గ్రామస్థులు నిరాకరించారు. అయితే.. గ్రామస్థులతో చర్చలు జరిపిన తరువాత విగ్రహాన్ని తరలించారు అధికారులు. అంతేకాదు.. పురాతన విగ్రహానికి సంబంధించిన వివరాలు పరిశోధన తరువాత వెల్లడిస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.