మరోసారి పెరిగిన పెట్రో ధరలు : హైదరాబాద్ లో ఎంతంటే ?

దేశంలో మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమన్నాయి. ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్‌ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.97.22 కాగా.. డీజిల్‌ రూ. 87.97 కు చేరింది.

read also : ఇండియా కరోనా అప్డేట్‌ : 24 గంటల్లో 42,640 కేసులు..

అటు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.33 కాగా, డీజిల్ ధర రూ.96.17 చేరింది. గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.70 కాగా.. డీజిల్‌ రూ. 97.94 కు చేరింది. అలాగే గుంటూరులో లీటర్‌ ప్రీమియం పెట్రలో ధర రూ. 107.15 కు చేరుకుంది. అటు చమురు ధరలు పెరగడం పట్ల వాహనదారులు, విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-