AP Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసుతో పాటు నకిలీ మద్యం తయారీ కేసు సంచలనం సృష్టించింది.. ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కు స్వల్ప ఊరట లభించింది.. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాముపై నమోదైన కేసులో ఎక్సైజ్ కోర్టు ఇవాళ ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది.. ఈ కేసులో అరెస్టైన జోగి రమేష్, జోగి రాము బ్రదర్స్..79 రోజులుగా విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు.. ఇవాళ బెయిల్ మంజూరు కావడంతో.. వారికి ఊరట లభించినట్టు అయ్యింది.. అయితే, ములకలచెరువు దగ్గర నకిలీ మద్యం తయారీ కేసులో కూడా జోగి రమేష్ నిందితుడిగా ఉండటంతో ఆయనకు ఇబ్రహీంపట్నంలో బెయిల్ లభించినా.. జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు లేవు.. ఆ కేసులో కూడా బెయిల్ వస్తే జోగి రమేష్ జైలు నుంచి విడుదలవుతారని తెలుస్తోంది..
Read Also: RRB Group D: రైల్వేలో 22,000 గ్రూప్ డి పోస్టులు.. కొత్త అప్లికేషన్ డేట్ ఇదే