దేశ వ్యాప్తంగా 22.45 కోట్లకుపైగా టీకా డోసుల నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మిగులు డోసులు ఉండటం తో టీకా వాణిజ్యపర ఎగుమతులపై కేంద్రప్రభుత్వం త్వరలోనే నిర్ణ యం తీసుకునే అవకాశం ఉంది. నవంబర్ నెలలో దాదాపు 31 కోట్ల డోసుల్ని డెలివరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 20నుంచి 22 కోట్ల డోసుల కంటే ఎక్కువ పంపిణీ చేస్తాయని అనుకోవడం లేదు. మిగిలిన వాటిని ఎగుమతి చేస్తామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. డిసెంబర్ నాటికి నిల్వ డోసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోపక్క కోటి డోసులు ఎగుమతి చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు కేంద్రం అను మతి ఇచ్చింది. భారత్ మార్చి 25వరకు కొవాగ్జిన్ 28 మిలియన్ డోసు ల్ని సరఫరా చేసింది. అదే నెలలో మరో 28 మిలియన్ డోసులు, ఏప్రిల్ నెలలో 50 మిలియన్ల డోసుల్ని ఎగుమతి చేయాలని భావిం చింది. కానీ ఆసమయంలో భారత్ కరోనా సెకండ్ వేవ్‌లో చిక్కు కుంది. దాంతో టీకాల ఎగుమతి నిలిచిపోయింది.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. మరోపక్క కోవాగ్జిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థనుంచి అనుమతులు వచ్చాయి. దాం తో కోవాగ్జిన్ టీకాలను ఇతర దేశాలకు సరఫరా చేయనున్నట్టు ఒక అధికారి వెల్లడించారు. వాణిజ్యపరంగా టీకా ఎగుమతులపై ఆలోచి స్తున్నట్లు పేర్కొన్నారు. బయోలాజికల్-ఇ టీకా కార్బివ్యాక్స్ కూడా డిసెంబర్‌లో అత్యవసర వినియోగ అనుమతులు పొందే అవకాశం ఉంది. అయితే ఈ టీకాలను ఇతర దేశాల సరఫరాకే వినియోగించ నున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 82 శాతం మంది ప్రజలు మొదటిడోసు, 42శాతం మంది రెండో డోసు వేయించుకు న్నారు. అంటే కనీసం 82శాతం మంది కార్బివ్యాక్సిన్‌ను వేయించు కునే వీలు లేదు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు టీకా డోసుల కోసం వేచి చూస్తున్నాయి. సుమారు 195 దేశాల్లో 40దేశాలు మాత్రమే 75 శాతం టీకా డోసుల్ని అందించగలిగాయి. మిగిలిన 150 దేశాలు 30 శాతమే వేసినట్టు కార్బివ్యాక్స్ గురించి ఒక అధికారి సమాధానంగా చెప్పారు.