2029 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా ఇండియా కూటమి పని చేస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో తేజస్వి యాదవ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. 2029 లోక్‌సభ ఎన్నికలకు రాహుల్ గాంధీని ఇండియా కూటమి ప్రధానమంత్రిగా నిలబెట్టాలని తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. బీహార్‌లోని నవాడాలో జరిగిన ఓటర్ అధికార్ ర్యాలీలో రాహుల్ పక్కన ఉండగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: US: రెస్టారెంట్లో ఫుడ్ ఆరగిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు.. హఠాత్తుగా ఏం జరిగిందంటే..!
అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం పని చేస్తోందని.. ఓట్ల చోరీ కోసమే ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే చేపట్టిందని ఆరోపించారు. బీహార్ ప్రజలను మోసం చేయడానికి ఎన్డీఏ-ఈసీ కుట్రకు పూనుకున్నాయని పేర్కొన్నారు. బ్రతికున్న వారి ఓట్లను కూడా తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ చెప్పినట్లుగానే ఈసీ పని చేస్తుందన్నారు. ఎన్డీఏ కూటమిని దించితేనే బీహార్ బాగుపడుతుంందన్నారు.
ఇది కూడా చదవండి: INDIA Bloc: ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి.. తెలంగాణ వ్యక్తి పేరు ప్రకటించిన ఖర్గే
బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీలో విపక్షాలు యుద్ధం చేస్తున్నాయి. అధికార పార్టీకి ఈసీ తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి.