Bihar Elections: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే బీజేపీ, దాని మిత్రపక్షం జేడీయూలు తొలి విడత అభ్యర్థుల లిస్ట్‌లను విడుదల చేశాయి. పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రఘోపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ఈ స్థానం నుంచి గెలిచి, హ్యట్రిక్ సాధించాలని తేజస్వీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Also: Afghan-Pak War: ఆఫ్ఘాన్-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత.. సాధారణ పౌరులపై పాక్ దాడులు..
గతంలో రఘోపూర్ నుంచి తేజస్వీ తల్లిదండ్రులు సీఎంలుగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవీలు పోటీ చేశారు. 35 ఏళ్ల తేజస్వీ యాదవ్ వైశాలి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, తండ్రి లాలూ సమక్షంలో నామినేషన్ వేశారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరిన సమయంలో ఆయనకు ఆర్జేడీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. 20 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఆర్జేడీ అధికారంలోకి రావడానికి భావిస్తోంది.
