Rakhi Sawant Marriage - Taslima Nasreen comments: వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ మరోసారి ఇస్లాంపై వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం ఛాందసవాదాన్ని ఎదురించిన తస్లిమా సొంత మతం నుంచే బెదిరింపులు, దాడులకు గురైంది. ఇస్లాంలోని తప్పులను ఎత్తి చూపడంలో ముందుంటారు. ఇదిలా ఉండే ఆమె మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్ స్వాతంత్య్రం, స్త్రీల సమానత్వం, ముస్లిమేతర హక్కులు మొదలైనవాటిని అంగీకరించాలని లేకపోతే ఆధునిక సమాజంలో దీనికి స్థానం ఉండదని అన్నారు.