Tara Shahdeo: షూటర్ తారా “లవ్ జిహాద్” కేసు.. మాజీ భర్తకు జీవిత ఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tara Shahdeo: జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ ‘లవ్ జిహాద్’ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బలవంతపు మతమార్పిడి, ముస్లిం వ్యక్తి అయి ఉండీ హిందువుగా నటించి తారా సహదేవ్ ని పెళ్లాలడం, ఆ తరువాత బలవంతంగా మతం మారాలని ఒత్తిడి చేసిన కేసులో కీలక తీర్పును వెల్లడించింది. తారా సహదేవ్ మాజీ భర్త రకీబుల్‌కు జీవిత ఖైదు విధించిడంతో పాటు అతడి తల్లి కౌసర్ రాణికి పదేళ్లు జైలు శిక్ష, కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ హైకోర్టు మాజీ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ కోర్టు. దీంతో పాటు నిందితులకు రూ. 50,000 జరిమానా విధించింది.
ఈ కేసులో తీర్పుపై తారా ఆనందం వ్యక్తం చేశారు కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ న్యాయం తనకు మాత్రమే కాదని తనలా బాధించబడుతున్న మహిళలకు ముందడుగు అని ఆమె అన్నారు. ప్రతీ మహిళలో విశ్వాసాన్ని నింపుతుందని, నాలాంటి అమ్మాయిలు అన్యాయాలపై ఎదురించి పోరాడేందుకు సహాయపడుతుందని ఆమె అన్నారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also:Ukraine War: ఉక్రెయిన్ సూపర్ మార్కెట్‌పై రష్యా దాడి.. 49 మంది మృతి
కేసు వివరాలు ఇవే:
జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్‌ని రకీబుల్ అనే వ్యక్తి రంజిత్ కోహ్లీగా పేరు మార్చుకుని ప్రేమ పేరుతో వంచించి 2014లో వివాహం చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నప్పటికీ.. కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తారా సహదేవ్ కి తెలిసింది. అప్పటి నుంచి ఆమె భర్త రకీబుల్ హసన్ తో పాటు ఆమె తల్లి కౌసర్ రాని మతం మార్చుకోవాని ఆమెపై ఒత్తడి తెచ్చారు. హింసకు గురిచేశారు.
నేరపూరిత కుట్రతో పాటు, పదే పదే అత్యాచారం చేసేందుకు కుట్ర, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలపై హింద్‌పిరి పోలీస్ స్టేషన్ లో తార ఫిర్యాదు చేశారు. ముందస్తు కుట్ర ప్రకారమే ముగ్గురు నిందితులు తారా సహదేవ్ ని మోసం చేశారు.
నిందితులు తారని మానసికంగా, శారీరకంగా ఇస్లాంలోకి మారాలని వేధించారు. ఈ కేసులో విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు 2015లో సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ కేసు ‘లవ్ జిహాద్’ కేసుగా ఆరోపించబడింది. దాదాపుగా తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి పీకే శర్మ గత వారం ముగ్గురిని దోషులుగా తేల్చారు. తాజాగా ఈ రోజు శిక్షను విధించారు. 2018లో రాంచీ ఫ్యామిలీ కోర్టు తారకు విడాకులు మంజూరు చేసింది.
#WATCH | Ranchi, Jharkhand: National Shooter Tara Shahdeo says, "I want to thank the court and the CBI who served me justice. This justice is not just for me, every daughter in the country will gain trust that whoever does this to them will be punished. People who do this would… pic.twitter.com/zBpgxOWocZ
— ANI (@ANI) October 5, 2023
తాజావార్తలు
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: ప్రేమించిన అమ్మాయినే చంపేశాడు.. లవ్ స్టోరీలో ఇంత షాకింగ్ ట్విస్ట్ ఏంటి?.. ‘గజ’ టీజర్ అదిరిందిగా!
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!