Tamil Nadu: కార్తీక దీపం వేళ తమిళనాడులో హైటెన్షన్.. తిరుప్పరకుండ్రంలో ఆంక్షలు, బీజేపీ నేతల అరెస్ట్!
- కార్తీక దీపం వేళ తమిళనాడులో హైటెన్షన్..
- తిరుప్పరంకుండ్రంలో భారీగా మోహరించిన పోలీసులు..
- కొండపై దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి..
- దీపం వెలిగిస్తే మతసామరస్యానికి దెబ్బ అని విజయ్ సర్కార్ వాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో తిరుప్పరంకుండ్రం ‘‘కార్తీక దీపం ’’ వివాదం కారణంగా హైటెన్షన్ నెలకొంది. సుప్రీంకోర్టు పవిత్రమైన తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్(దీప స్తంభం) వద్ద దీపాన్ని వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు, దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని విజయ్ సర్కార్ చూస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుపై విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. నవంబర్ 24న సాయంత్రం కార్తీక దీపం వెలిగించే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
తిరుప్పరంకుడ్రంలో హైటెన్షన్..
మరోవైపు, తమిళనాడు ప్రభుత్వం తిరుప్పరంకుండ్రంలో ఆంక్షలు విధించింది. కొండపై సుబ్రమణ్య స్వామి ఆలయంతో పాటు ఒక దర్గా ఉంది. దీంతో వివాదం నెలకొంది. అయితే, దీపం వెలిగిస్తే ఇది మత సామరస్యానికి, శాంతిభద్రతలకు సమస్యగా మారుతుందని విజయ్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో కొండ పరిసర ప్రాంతాల్లో మొత్తం 5,618 మంది పోలీసులను మోహరించారు. దక్షిణ తమిళనాడు జిల్లాలకు చెందిన 12 మంది ఎస్పీలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 70కి పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనుమానాస్పద, సున్నితమైన ప్రాంతాల్లో బాంబు నిర్వీర్య బృందాలను ఏర్పాటు చేశారు.
Also Read
- Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు.. టీవీకే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్..!
- Punjab BJP-SAD Alliance 2027: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. మళ్లీ చేతులు కలిపిన బీజేపీ-అకాలీదళ్!
- SP - Congress Alliance: కాంగ్రెస్ ఆశలకు ఎస్పీ బ్రేక్ వేయనుందా..? తెరపైకి 26 సీట్ల ఫార్ములా..!
- Sonia Gandhi: 'నాన్నను చంపించడానికే భద్రత తొలగించారు'.. రాజీవ్ గాంధీ హత్యపై సోనియా సంచలన వ్యాఖ్యలు!
బీజేపీ, హిందూ సంఘాల నేతలు అరెస్ట్..
మరోవైపు, బీజేపీ నేతలతో పాటు హిందూ సంస్థలకు చెందిన నాయకుల్ని నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. తమ పార్టీకి చెందిన 750 మంది నాయకుల్ని, కార్యకర్తల్ని హౌజ్ అరెస్ట్ చేసినట్లు బీజేపీ ఆరోపిస్తోంది.
మదురై జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణన్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 163 కింద జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. సభలు, ప్రదర్శనలు, ఊరేగింపులు, బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించారు. తిరుప్పరంకుండ్రం కొండపైకి వెళ్లడంపైనా నిషేధం ప్రకటించారు. ఈ ఆదేశాలు సోమవారం రాత్రి 9 గంటల నుంచి నవంబర్ 25 ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటాయి.
విజయ్ ప్రభుత్వ నిర్ణయానికి కాంగ్రెస్ మద్దతు..
సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, కార్తీక దీపం వెలిగించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో హిందూ సంస్థలు, బీజేపీ టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. డీఎంకే లాగే టీవీకే కూడా హిందూ వ్యతిరేక పార్టీ అని ఆరోపిస్తోంది. మరోవైపు, విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్ధించింది. ఆర్ఎస్ఎస్, హిందూ మున్నాని, బీజేపీ సంస్థలు మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ఆరోపించారు.
వివాదం ఏమిటి..
తిరుప్పరంకుండ్రం కొండపై సికిందర్ బాదుషా దర్గా సమీపంలో పురాతన రాతి స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించే విషయంలో వివాదం ఉంది. ఈ అంశంపై 2025 నవంబర్‌లో అప్పటి డీవీకే ప్రభుత్వం దీపం వెలిగించేందుకు నిరాకరించింది. శాంతిభద్రతలను సమస్యలుగా ప్రస్తావించింది. దీనిపై భక్తుడు రామ రవికుమార్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది.
హైకోర్టు ఉత్తర్వుల్ని విజయ్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. నవంబర్ 20న విచారణ జరిపిన సుప్రీంకోర్టు, నవంబర్ 24 ఒక్క రోజు మాత్రమే దీపతూర్ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, ప్రభుత్వం మాత్రం దీపం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.
తాజావార్తలు
-
Tamil Nadu: కార్తీక దీపం వేళ తమిళనాడులో హైటెన్షన్.. తిరుప్పరకుండ్రంలో ఆంక్షలు, బీజేపీ నేతల అరెస్ట్!
-
Nvidia Windfall: అదృష్టమంటే ట్రంప్‌దే.. ఆ సీఈఓ రీ-ఎంట్రీతో ఏకంగా 1.4 బిలియన్ల లాభం!
-
Pakistan: అసిమ్ మునీర్ ప్లాన్‌పై రగులుతున్న పాకిస్తాన్.. ప్రత్యేక ‘‘సింధు దేశ్’’ కోసం డిమాండ్..
-
Dimple Hayathi: నా పెళ్లి ఎప్పుడైంది బాబూ? నెటిజన్ కామెంట్‌కు డింపుల్ హయాతి క్రేజీ రిప్లై!
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
ట్రెండింగ్
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!