తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యా విధానానికి స్వస్తి పలికి రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రకటించారు.
MK Stalin: జాతీయ విద్యా విధానం (NEP)పై గత కొన్ని రోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య గొడవ జరుగుతోంది. తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. తాను ఈ NEPకి వ్యతిరేకంగా తన వైఖరిపై రాజీ పడలేనని చెప్పారు. రూ.10,000 కోట్లు ఇచ్చినా కూడా తమిళనాడులో దీనిని అమలు చేయమని చెప్పారు.
కర్ణాటక రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలుపై రగడ కొనసాగుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో నూతన విద్యా విధానం రద్దు చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2024-25 విద్యా సంవత్సరం నుంచి కర్ణాటకలో జాతీయ విద్యా విధానం-2020ని రద్దు చేయనున్నట్టు ప్రకటించింది.