ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీటులోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్వాతి మాలివాల్‌పై దాడి జరిగిన కొద్దిసేపటికే కేజ్రీవాల్.. నిందితుడు భిభవ్ కుమార్‌తో ఉన్నట్లు చార్జ్‌షీటులో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఆయన ఉనికి సంబంధించిన సమయం, సందర్భం పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది. స్వాతి మాలివాల్‌పై దాడి వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని చార్జ్‌షీటులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆ బిల్లుకు ఆమోదం
మే 13న ముఖ్యమంత్రి నివాసంలో స్వాతి మాలివాల్‌పై కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ భౌతికదాడికి పాల్పడ్డారు. రుతుక్రమంలో ఉన్నానని ప్రాధేయపడినా కనికరించకుండా ఇష్టానురీతిగా దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ దాడి జరిగినట్లుగా ఒప్పుకున్నారు. అనంతరం మంత్రి అతిషి.. స్వాతి మాలివాల్ తీరును తప్పుపట్టారు. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విరుద్ధమైన ప్రకటనలు వచ్చాయి. స్వాతి మాలివాల్ వాంగ్మూలం ప్రకారం ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఇది కూడా చదవండి: KTR: దుష్ప్రచారాలు చేస్తున్న మీడియా సంస్థలకు హెచ్చరికలు చేసిన కేటీఆర్..