Swati Maliwal Case: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో జరగాల్సిన 6 వ విడత ఎంపీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం ఆప్‌ని చిక్కుల్లో పడేసింది. ఆప్ పార్టీని, సీఎం అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్‌గా బీజేపీ విమర్శలు గుప్పించింది. మే 12న సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ స్వాతిమలివాల్‌పై దాడి చేశాడు. చెంపపు 7-8 సార్లు కొట్టడంతో పాటు తన పొట్టు, కటి భాగంపై కాలితో తన్నాడని మలివాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడు బిభవ్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Prajwal Revanna Scandal: ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కేంద్రం చర్యలు మొదలు.. “షోకాజ్” నోటీసులు జారీ..
ఇదిలా ఉంటే శుక్రవారం నిందితుడు బిభవ్ కుమార్‌ని పోలీసులు ఢిల్లీలోని తీహ హజారీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. ఈ కేసులో నిందితుడు సాక్ష్యాలను నాశనం చేశాడని పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణ సందర్భంగా మే 18న బిభవ్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్‌ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మరోవైపు ఘటన జరిగిన తర్వాత బిభవ్ కుమార్ తన ఫోన్‌ని ఫార్మాట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని కూడా పోలీసులు ఫోరెన్సిక్ విచారణకు పంపారు. మొత్తం 8 సీసీటీవీ కెమెరాల్లోని గంటల తరబడి ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.