Suvendu Adhikari: బీజేపీలో చేరాలని ప్రణబ్ ముఖర్జీనే సలహా ఇచ్చారు..! సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాల్లో పని చేసిన ప్రణబ్ ముఖర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి.. తన రాజకీయ జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన ఆయన.. ప్రణబ్ ముఖర్జీ తనకు కీలకమైన రాజకీయ సలహా ఇచ్చారని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC)ను వీడి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ముందుకు సాగాలని ప్రణబ్ ముఖర్జీ సూచించినట్లు వెల్లడించారు. కోల్‌కతాలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ బెంగాల్ అసెండ్స్ సదస్సులో సువేందు అధికారి ఈ విషయాలను గుర్తుచేసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఆయనను కలిసేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లినట్లు చెప్పారు. అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ తనకు మార్గదర్శిగా, సలహాదారుగా వ్యవహరించారని పేర్కొన్నారు.
మోడీతో కలిసి ముందుకు సాగాలని సూచించారు
ప్రణబ్ ముఖర్జీ తనతో మాట్లాడుతూ.. మరొకరి నాయకత్వంలోనే కొనసాగాలనుకుంటున్నావా? లేక ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి నీ రాజకీయ లక్ష్యాల దిశగా ముందుకు సాగాలనుకుంటున్నావా? అని ప్రశ్నించినట్లు సువేందు అధికారి వెల్లడించారు. రాజకీయంగా సొంతంగా ఎదగాలనుకునే వారు సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించినట్లు గుర్తుచేసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత వ్యవస్థపైనా ప్రణబ్ ముఖర్జీ విమర్శలు చేసినట్లు సువేందు తెలిపారు. ఆ పార్టీ మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల నియంత్రణలో ఉందని, ఒక కంపెనీలో చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వ్యవహరించినట్లుగా పార్టీ నడుస్తోందని ప్రణబ్ వ్యాఖ్యానించినట్లు చెప్పారు. TMCలో కొనసాగితే పార్టీ నాయకత్వానికి లోబడి పనిచేయాల్సి వస్తుందని భావించిన సువేందు అధికారి, తన రాజకీయ భవిష్యత్తు కోసం స్వతంత్రంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి.. 2020లో TMCని వీడి బీజేపీలో చేరారు. అయితే, ప్రణబ్ ముఖర్జీ 2020 ఆగస్టులోనే మరణించారు.
Also Read
- Tamil Nadu Government: TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై ఫిర్యాదు.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
- Central Cabinet: కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఆ రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్..
- Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ రాజీనామా..
- Imran: ‘మేము బిచ్చగాళ్లం కాదు’.. ఎస్పీ సీట్ల ప్రకటనపై భగ్గుమన్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్..
ప్రణబ్ ముఖర్జీని రాజకీయ మార్గదర్శిగా భావించిన సువేందు
ప్రణబ్ ముఖర్జీని తాను కేవలం రాజకీయ సలహాదారుగానే కాకుండా సంరక్షకుడిగా కూడా భావించేవాడినని సువేందు అధికారి తెలిపారు. రాజకీయంగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. అయితే, ఈ సంభాషణ ఎప్పుడు జరిగిందనే ప్రశ్నకు సువేందు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దివంగత నేతకు సంబంధించి మరో వివాదం తలెత్తడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కాగా, ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలతోనూ ఆయన సత్సంబంధాలు కొనసాగించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు అప్పట్లో విమర్శలు కూడా చేశారు.
ఇక, ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాసిన Belonging: A Journey of Love అనే జ్ఞాపకాల పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్ష కలిగి ఉన్నారని పేర్కొనడంతో మరోసారి చర్చ మొదలైంది. దీనిపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ సోనియా గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలతో ప్రణబ్ ముఖర్జీ రాజకీయ సంబంధాలు, ఆయన ఇచ్చిన సలహాల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
Suvendu Adhikari: బీజేపీలో చేరాలని ప్రణబ్ ముఖర్జీనే సలహా ఇచ్చారు..! సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు
-
Nithya Menen: ఆ స్టార్ హీరోయిన్‌కి పెళ్లి చేసుకోవాలని ఉందట!
-
IPL Auction: ఐపీఎల్ 2027 వేలంలో బెన్ స్టోక్స్‌కు గ్రీన్ సిగ్నల్.. హ్యారీ బ్రూక్‌పై వేటు.. కారణం ఇదే..
-
Tamil Nadu Government: TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై ఫిర్యాదు.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!