Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..
- బెంగాల్‌లో కొనసాగుతున్న హత్యా రాజకీయాలు..
- సువేందు అధికారి పీఏ హత్య..
- మమతా బెనర్జీని ఓడించినందుకే హత్య చేశారన్న బీజేపీ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: బెంగాల్‌లో ఎన్నికల తర్వాత హత్యా రాజకీయాలు ఆగడం లేదు. బీజేపీ నేత, ముఖ్యమంత్రి రేసులో ముందున్న సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్‌ను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. పక్కా పథకం ప్రకారమే హత్య జరిగినట్లు పోలీసులు చెప్పారు. గురువారం రథ్ పోస్టుమార్టం అనంతరం బరసత్ స్టేట్ జనరల్ హాస్పిటల్ వెలుపల సువేందు మాట్లాడుతూ.. చంద్రనాథ్ రథ్ తనకు పీఏగా పనిచేయకపోయినా, తాను మమతా బెనర్జీని ఓడించకపోయినా, ఆ మాజీ భారత వైమానిక దళ అధికారి హత్యకు గురయ్యేవాడు కాదని ఆయన అన్నారు.
Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్‌ను ఎవరు పాలిస్తారు.?
Also Read
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
రథ్ తన సహాయకుడు కావడం వల్లే, మమతా బెనర్జీని తాను భవానీపూర్‌లో ఓడించడం వల్లే హత్యకు గురయ్యారని సువేందు అధికారి అన్నారు. తాను రథ్ కుటుంబానికి అండగా నిలుస్తానని, హత్య చేసిన వారిని పట్టుకుని శిక్ష పడేలా చూస్తానని, అతడిపై 4 బుల్లెట్లు కాల్చినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని, ఈ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని ఆయన అన్నారు. రథ్‌కు వ్యక్తిగత లేదా రాజకీయ వైరం లేదని సువేందు చెప్పారు.
కోల్‌కతా సమీపంలోని మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో బుధవారం రాత్రి రథ్ కారును వెండించి, తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆయన మరణించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం చండీపూర్‌కు తీసుకెళ్లారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సహా సీనియర్ బీజేపీ నాయకులు నివాళులర్పించారు. ఈ ఘటనలో హత్యకు ఉపయోగించిన బైక్‌ను ఘటనాస్థలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పోలీసులు గుర్తించారు. కొందరు అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?