దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ సమీపంలో బహుళ డ్రోన్ చొరబాటు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. రాజౌరిలోని ఎల్‌ఓసీ వెంట నౌషెరా సెక్టార్‌ను కాపలా కాస్తున్న ఆర్మీ దళాలు… గనియా-కల్సియన్ గ్రామంపై డ్రోన్ కదలికను గమనించి వెంటనే లైట్ మెషిన్ గన్‌లతో కాల్పులు జరిపారు.
ఇది కూడా చదవండి: Mana Shankara Vara Prasad Garu Review : మన శంకర వరప్రసాద్ గారు రివ్యూ.. మెగాస్టార్ హిట్ కొట్టాడా లేదా?
జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ), నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి అనేక ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భద్రతా దళాలు అనుమానిత డ్రోన్‌ల కదలికను గుర్తించాయని అధికారులు తెలిపారు. ఎగిరే వస్తువులన్నీ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చాయని.. కొన్ని నిమిషాలు భారత భూభాగంపై సంచరించాయని వెల్లడించారు. అనుమానిత డ్రోన్ కార్యకలాపాలను గమనించిన వెంటనే భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Shocking: ప్రేమ కోసం.. లండన్ నుంచి వచ్చి తల్లిని చంపిన కొడుకు..
రాజౌరిలోని నియంత్రణ రేఖ వెంబడి నౌషెరా సెక్టార్‌ను కాపలా కాస్తున్న సైనిక దళాలు తొలుత సాయంత్రం 6.35 గంటల ప్రాంతంలో గనియా-కల్సియన్ గ్రామంపై డ్రోన్ కదలికను గమనించగానే మీడియం, లైట్ మెషిన్ గన్‌ల నుంచి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. సాయంత్రం 6.35 గంటలకు రాజౌరి జిల్లాలోని టెర్యాత్‌లోని ఖబ్బర్ గ్రామంలో మరో డ్రోన్ కనిపించిందని.. మెరిసే కాంతితో ఎగిరే వస్తువు కలకోట్‌లోని ధర్మసల్ గ్రామం వైపు నుంచి వచ్చి భరఖ్ వైపు కదిలిందని అధికారులు తెలిపారు.
ఇక సాంబాలోని రామ్‌గఢ్ సెక్టార్‌లోని చక్ బాబ్రాల్ గ్రామంపై సాయంత్రం 7.15 గంటల ప్రాంతంలో డ్రోన్ లాంటి వస్తువు మెరుస్తున్న కాంతితో చాలా నిమిషాలు తిరుగుతున్నట్లు వెల్లడించారు. అలాగే పూంచ్ జిల్లాలోని ఎల్‌ఓసి వెంబడి ఉన్న తంయిన్ దిశ నుంచి మంకోట్ సెక్టార్‌లోని టోపా వైపు సాయంత్రం 6.25 గంటలకు మరో డ్రోన్ లాంటి వస్తువు కదులుతున్నట్లు కనిపించిందని తెలిపారు. శుక్రవారం రాత్రి సాంబా జిల్లాలోని ఐబి సమీపంలోని ఘగ్వాల్‌లోని పలూరా గ్రామంలో పాకిస్థాన్‌లో తయారైన డ్రోన్ ద్వారా జారవిడిచినట్లు భావిస్తున్న ఆయుధ సముదాయాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్‌లు, 16 రౌండ్లు, ఒక గ్రెనేడ్ ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.
గతేడాది మే 7న పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అనేక పాకిస్థానీ డ్రోన్లను కూల్చేసింది. అప్పటి నుంచి డ్రోన్ల సంచారం తగ్గాయి. మళ్లీ ఇన్ని రోజులు తర్వాత ఒకేసారి పాకిస్థాన్ డ్రోన్ల సంచారం కనిపించాయి. భారత భూభాగంపై ఆయుధాలు, మాదకద్రవ్యాలను విడిచిపెట్టేందుకు ఉగ్రవాద గ్రూపులకు మద్దతుగా పాకిస్థాన్ ఈ డ్రోన్లను ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.