దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ సమీపంలో బహుళ డ్రోన్ చొరబాటు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. రాజౌరిలోని ఎల్‌ఓసీ వెంట నౌషెరా సెక్టార్‌ను కాపలా కాస్తున్న ఆర్మీ దళాలు... గనియా-కల్సియన్ గ్రామంపై డ్రోన్ కదలికను గమనించి వెంటనే లైట్ మెషిన్ గన్‌లతో కాల్పులు జరిపారు.