ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన మాంసాహార పార్టీ తీవ్ర వివాదానికి దారితీసింది. దీనితో ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ఘటన గుజరాత్ లోని సూరతో ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. గొదాదర ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఒక సమావేశంలో ప్రజలు చికెన్, మటన్ పదార్థాలు తింటున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Women Cricketers : బుర్ఖా ధరించి క్రికెట్ పిచ్ లోకి మహిళా క్రికెటర్లు..
పూర్తి వివరాల్లోకి వెళితే.. చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాల పార్టీకి వేదికగా మారింది. చికిన్, మటన్ వంటి ఆహారంతో నాన్ వెజ్ పార్టీ చేసుకున్నారు. ఈ సమయంలో స్కూల్ లో ఉన్న సరస్వతి దేవి విగ్రహానికి కండువా కప్పారు. ఇందులో మరో విషయం ఏంటంటే.. పార్టీ కోసం ఏర్పాటు ఫ్లెక్సీ తెలుగులో ఏర్పాటు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వివాదానికి దారితీసింది. దీంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఆవరణలో నాన్-వెజ్ పార్టీని నిర్వహించినందుకు ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. ఆయనపై శాఖాపరమైన విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడిచారు.
Read Also: Bike Accident: ట్రాక్ పై పడిపోయిన యువకుడు.. అనుకోకుండా వెనుక నుంచి రైలు…
ఆదివారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగిందని, పాఠశాల ప్రధాన ద్వారం మీద ఉన్న 1987, 1991 మధ్య కాలంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ పార్టీ నిర్వహించినట్లు సమాచారం. ఈ నాన్-వెజ్ విందు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక విద్యా కమిటీ సాయంత్రం దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తు ఫలితాల ఆధారంగా, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ ఎలిగాటిన్‌ను సస్పెండ్ చేయాలని పిఇసి ఆదేశించిందని అధికారి తెలిపారు.

Surat | પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં નોનવેજ પાર્ટી મામલે સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન#Surat #Nonvegparty #PrimaryEducationCommittee #school #RajendraKapadia #Gujarat #GujaratiNews #MantavyaNews pic.twitter.com/pZtsWiVuB6
— Mantavya News (@Mantavyanews) October 13, 2025