Women Cricketers : బుర్ఖా ధరించి క్రికెట్ పిచ్ లోకి మహిళా క్రికెటర్లు..
- శ్రీలంక వేదికగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025
- ఇద్దరు మహిళా క్రికెటర్లు బుర్ఖా ధరించిన ఫోటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక వేదికగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 నిర్వహిస్తున్నారు. ఇందులో పలు దేశాలు పాల్గొంటున్నాయి. అయితే బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు బుర్ఖా ధరించి క్రికెట్ పిచ్ పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also:Bike Accident: ట్రాక్ పై పడిపోయిన యువకుడు.. అనుకోకుండా వెనుక నుంచి రైలు…
Also Read
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది . ఇప్పుడు, మ్యాచ్‌కు సంబంధించినదిగా చెప్పబడుతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరు బుర్ఖా ధరించిన క్రీడాకారిణులు క్రికెట్ పిచ్‌పై నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 జరుగుతోంది. వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో భారత్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి 8 జట్లతో పాటు బంగ్లాదేశ్ జట్టు కూడా పాల్గొంటోంది. అయితే, ఈ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ జట్టుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో బంగ్లాదేశ్ క్రీడాకారిణులు బురఖా ధరించి క్రికెట్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో అసలు బంగ్లాదేశ్ మహిళలు నిజంగానే బురఖా వేసుకుని ప్రపంచ కప్‌లో ఆడుతున్నారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఈ ఫోటో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో క్రయేట్ చేసినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.
Read Also:ముసలోడికి దసరా పండగే.. లేట్ వయసులో తండ్రి కాబోతున్న వృద్ధుడు
నిగర్ సుల్తానా కెప్టెన్సీలో బంగ్లాదేశ్ మహిళా జట్టు ప్రపంచ కప్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తోంది. టోర్నీలో తమ మొదటి మ్యాచ్‌లోనే ఆ జట్టు పాకిస్తాన్‌ను ఓడించి సత్తా చాటింది. అంతేకాకుండా ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లను కూడా గట్టిగా ఇబ్బంది పెట్టింది. అయితే, మైదానంలో క్రీడాకారిణులు పోరాడుతుంటే సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఒక ఫోటో మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది. బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ దేశం అయినప్పటికీ ఆ దేశానికి చెందిన మహిళా క్రికెటర్లు టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ఇతర మహిళా క్రీడాకారిణుల మాదిరిగానే సాధారణ జెర్సీ, క్రికెట్ కిట్‌ను ధరించి ఆడుతున్నారు. బురఖా ధరించి ఆడుతున్నారనే వాదనలు, ఫోటోలు పూర్తిగా నిరాధారమైనవి. తప్పుడు ప్రచారంలో భాగమే.
తాజావార్తలు
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
-
Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!