Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సుప్రీంకోర్టు ఈ రోజు (బుధవారం) తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఏడాది జనవరిలో ఈడీ దాడులు జరుగుతున్న సమయంలో ఆమె స్వయంగా రంగంలోకి దిగడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు “ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలో పడేస్తాయని” అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. అసలేం జరిగిందంటే..
ఈ ఏడాది జనవరిలో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఐ-ప్యాక్ కో-ఫౌండర్ ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకున్నారు. దర్యాప్తు జరుగుతుండగానే ఆమె లోపలికి వెళ్లి కొన్ని కీలక పత్రాలను తనతో పాటు తీసుకెళ్లారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ ఉదంతంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పి.కె. మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. “ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దర్యాప్తు మధ్యలో జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది.” అని బెంచ్ పేర్కొంది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన చర్య అని, దానికి కేంద్రం-రాష్ట్రం మధ్య వివాదం అనే రంగు పులమడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. “రాజ్యాంగ నిపుణులు అంబేద్కర్ లేదా హెచ్.ఎమ్. సీర్వాయి వంటి వారు కూడా ఒక ముఖ్యమంత్రి దర్యాప్తులో అడ్డుతగులుతారని ఊహించి ఉండరు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read
- MK Stalin: రాహుల్‌గాంధీకి వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్‌డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్‌లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్‌పాత్‌పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. ఈడీ ఒక ఏజెన్సీ మాత్రమేనని, దానికి ప్రాథమిక హక్కులను క్లెయిమ్ చేసే అధికారం లేదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ తరపున మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలను మార్చే ప్రయత్నం చేస్తోందని, రాష్ట్రం ఒకేసారి ‘నేరస్థుడు, బాధితుడు’ కాలేదని వాదించారు. దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగించడం, అదీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అడ్డుతగలడం చట్టబద్ధమైన పాలనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
MK Stalin: రాహుల్‌గాంధీకి వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పిన స్టాలిన్
-
Gas Lighter Cleaning Tips: గ్యాస్ లైటర్‌పై మొండి మురికి పోవట్లేదా?.. ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ బిగ్ షాక్.. హార్ముజ్ మళ్లీ మూసివేత
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
-
Good News : ఇక వాట్సాప్‌లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?