Delhi-NCR Air Pollution: ఢిల్లీలో గాలి పీల్చడం 30 సిగరెట్లు తాగినట్లేనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi-NCR Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ–ఎన్సీఆర్లో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. నగరంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటంతో ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా ఢిల్లీలో గాలి పీల్చడం రోజుకు 30 సిగరెట్లు తాగడంతో సమానమని అమికస్ క్యూరీ అపరాజితా సింగ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వివరించారు.
వాహనాల కాలుష్యమే ప్రధాన సమస్య.. సుప్రీంకోర్టు ఆందోళన
ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాల్లో వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ఒకటని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీ–ఎన్సీఆర్ రహదారులపై వాహనాలు బంపర్ టు బంపర్‌గా కదులుతున్నాయని సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ తగినంతగా లేదని, వాహనాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా చూడాలని గతంలో ఇచ్చిన ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని అమికస్ క్యూరీ అపరాజితా సింగ్ వెల్లడించారు. సరిహద్దుల్లో వాహనాలు నిలిచిపోవడం వల్ల కాలుష్యం మరింత పెరుగుతోందని వివరించారు. కోర్టు ఆదేశాల అమలులో లోపాలున్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ కూడా అంగీకరించారు.
Also Read
- UP Farmers Relief: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన యోగి సర్కార్.. అన్నదాతకు భారీ ఊరట
- Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
- Digvijaya Singh: "హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది".. దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
- Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
పంట వ్యర్థాల దహనంపై కీలక సూచనలు
ఢిల్లీ వాయు కాలుష్యానికి పంట వ్యర్థాల దహనం కూడా ఒక కారణంగా మారుతోంది. నవంబర్ 5న ఢిల్లీలో నమోదైన కాలుష్యంలో పంట వ్యర్థాల దహనం వాటా 14 శాతంగా ఉందని విచారణ సందర్భంగా వెల్లడించారు. ఈ సమస్యను అరికట్టేందుకు రైతులకు మరింత అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. పంట వ్యర్థాలను కొనుగోలు చేసే ధరను ముందుగానే ప్రకటిస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. పంట వ్యర్థాల నిర్వహణకు అవసరమైన యంత్రాలను వ్యక్తిగత రైతులకు అందించడం కంటే గ్రామ పంచాయతీలకు అందించడం మంచిదని సూచించారు. ఖరీదైన వ్యవసాయ యంత్రాల వ్యయాన్ని చిన్న, సన్నకారు రైతులు భరించలేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక, పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను ఉపయోగించడం రైతులకు భారంగా మారుతోందని అమికస్ క్యూరీ కోర్టుకు వివరించారు. ముఖ్యంగా ఇంధన ధరలు పెరగడంతో ఈ యంత్రాల నిర్వహణ ఖర్చులు అధికమవుతున్నాయని తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలతో పాటు వాటిని సేకరించడం, నిల్వ చేయడం, విక్రయించడం ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలను రైతులకు వివరించాలని సుప్రీంకోర్టు సూచించింది. పంట వ్యర్థాల నిల్వ కోసం అందుబాటులో ఉన్న గిడ్డంగుల సదుపాయాలను ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఈ ఏడాది పంట వ్యర్థాల దహనం ఘటనలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. ముఖ్యంగా హర్యానాలో ఈ ఘటనలు భారీగా తగ్గినట్లు వివరించింది. రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా పంట వ్యర్థాల దహనాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు చేసిన సూచనలను వ్యవసాయ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తామని కేంద్రం తరఫున వెల్లడించారు.
డీజిల్ రిక్షాల తొలగింపునకు చర్యలు
ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్‌తో నడిచే రిక్షాలను దశలవారీగా తొలగించే చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇప్పటికే అనేక చర్యలు అమలు చేస్తున్నట్లు వివరించింది. అయితే, నగరంలో వాహనాల సంఖ్య, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరోవైపు.. వేసవిలో కాలుష్య కారకాలు గాలిలో వ్యాపించి కొంతవరకు బయటకు వెళ్లిపోతాయని, శీతాకాలంలో మాత్రం వాతావరణ పరిస్థితుల కారణంగా అవి గాలిలోనే చిక్కుకుపోతాయని అమికస్ క్యూరీ వివరించారు. దీనివల్ల ఢిల్లీ ప్రజలు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. వర్షాల కారణంగా ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్య తీవ్రత కొంత తగ్గిందని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. అయినప్పటికీ, వాయు నాణ్యత సూచీ (AQI) 400 స్థాయికి చేరుకుంటుండటం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
దీపావళి వేడుకలతో పేదలకే ఎక్కువ ఇబ్బందులు
దీపావళి సమయంలో కాలుష్యం పెరగడం వల్ల పేద ప్రజలే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమికస్ క్యూరీ అపరాజితా సింగ్ కోర్టుకు తెలిపారు. కాలుష్యం కారణంగా కొందరు పేదలు పండుగ సమయంలో ఢిల్లీని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు. దీనిపై స్పందించిన సీజేఐ.. దీపావళి పండుగ పేదలకు ఉపాధి కల్పించే ముఖ్యమైన సమయమని వ్యాఖ్యానించారు. పండుగలను సామాజిక హోదాకు చిహ్నంగా మార్చుకునే సంపన్న వర్గాల వైఖరి వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. కాలుష్య నియంత్రణ చర్యల ప్రభావం సమాజంలోని అన్ని వర్గాలపై సమానంగా ఉండేలా చూడాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇక, ఢిల్లీ భౌగోళిక పరిస్థితుల కారణంగా కాలుష్య కారకాలు గాలి ద్వారా సులభంగా బయటకు వెళ్లలేకపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది. నగరంలో ప్రస్తుతం ఏ పరిశ్రమ కూడా కాలుష్యకర ఇంధనాలతో పనిచేయడం లేదని తెలిపింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని వెల్లడించింది.
కాలుష్య నియంత్రణ కాదు.. మూలాలను పరిష్కరించాలి!
వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తోందా అని సీజేఐ కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర కాలుష్యాన్ని తక్షణమే తగ్గించేందుకు నిపుణుల సూచనల ఆధారంగా ఎలాంటి అత్యవసర చర్యలు చేపట్టవచ్చో వివరించాలని కోరారు. కేవలం కాలుష్య నిర్వహణ చర్యలకే పరిమితం కాకుండా, సమస్యకు అసలు కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల దహనం, ప్రజా రవాణా లోపాలు వంటి అంశాలపై సమగ్రంగా దృష్టి పెట్టాలని సూచించింది. మొత్తంగా ఢిల్లీ–ఎన్సీఆర్లో వాయు కాలుష్య సమస్యను తాత్కాలిక చర్యలతో పరిష్కరించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా అవసరమని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు..
తాజావార్తలు
-
Delhi-NCR Air Pollution: ఢిల్లీలో గాలి పీల్చడం 30 సిగరెట్లు తాగినట్లేనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
-
Sharvari Wagh: ‘ముంజ్యా’ తర్వాత ఒక్క హిట్ లేదు.. శార్వరి ఆశలన్నీ ఆ సినిమాపైనే!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!
-
UP Farmers Relief: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన యోగి సర్కార్.. అన్నదాతకు భారీ ఊరట
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!