Site icon NTV Telugu

Supreme Court: ‘‘ మన రాజ్యాంగం గర్వకారణం’’.. నేపాల్, బంగ్లాలను ఉదహరించిన సుప్రీంకోర్టు..

Supreme Court2

Supreme Court2

Supreme Court: సుప్రీంకోర్టు బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో పెట్టే అంశాన్ని విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. బుధవారం సుప్రీంకోర్టులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది. రాష్ట్రాలు రూపొందించి బిల్లును క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భారత రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజా ప్రాముఖ్యత లేదా ఏ విధంగానైనా ప్రజల్ని ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే హక్కును నిర్వచించింది. ‘‘మన రాజ్యాంగం పట్ల మేమే గర్విస్తున్నాము’’ అని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.

Read Also: Minister Seethakka : మేడారం జాతరపై రాజకీయాలు వద్దు.. గద్దెల మార్పుపై సీతక్క ఆగ్రహం.!

‘‘మన పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి, నేపాల్ పరిస్థితిని చూశాము’’ అని సీజేఐ అన్నారు. నేపాల్‌లో జెన్ జెడ్ యువత చేస్తు్న్న హింసాత్మక ఆందోళనల్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆ ఆందోళనల్లో 21 మంది మరణించారు. ‘‘బంగ్లాదేశ్ కూడా ఇలాంటివే జరిగాయి’’ అని జస్టిస్ విక్రమ్ నాథ్ జోక్యం చేసుకున్నారు. గతేడాది బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్ల కారణంగా, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.

ఒక నెలకు పైగా బిల్లులను రిజర్వ్ చేసే విషయంలో గవర్నర్లను సమర్థిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లుల్లో 90 శాతం ఒక నెలలోపే గవర్నర్లు క్లియర్ చేస్తారని తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు. 1970 నుంచి 2025 వరకు 20 బిల్లులు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయని కోర్టుకు తెలియజేశారు. అయితే, ఈ గణాంకాలను తాము పట్టించుకోమని న్యాయమూర్తులు అన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 7 బిల్లులను రిజర్వ్ చేయడంతో డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Exit mobile version