పాన్ ఇండియా మూవీ లేకుండానే సత్తా చాటిన ప్రిన్స్ మహేశ్!

ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నాడు. అతని అభిమానులందరికీ ఇది సంతోషాన్ని కలిగించే వార్త. అయితే… మరో సెన్సేషనల్ న్యూస్ కూడా వాళ్లకు ఆనందాన్ని అందిస్తోంది. అదేమిటంటే… ముంబై బేస్డ్ పాపులర్ మీడియా ఏజెన్సీ ఆర్మాక్స్ మీడియా ఇటీవల ‘మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్స్ ఇన్ తెలుగు’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మొదటి స్థానం దక్కింది. సెకండ్ ప్లేస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడు. విశేషం ఏమంటే… ఇంతవరకూ పాన్ ఇండియా జోలికి పోకుండానే మహేశ్ బాబు ఈ చోటు దక్కించుకున్నాడు.

గత యేడాది ఇదే జాబితాలో బన్నీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, మహేశ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పుడు వీరి స్థానాలు అటూ ఇటూ అయ్యాయి. ఇక మూడో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండగా, ప్రభాస్, జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, నాని, చిరంజీవి, రవితేజ మిగిలిన తొలి పది స్థానాల్లో వరుసగా నిలిచారు. సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవికి తప్పితే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లకు చోటు దక్కలేదు. విశేషం ఏమంటే… ఈ జాబితాలోని పది మంది కూడా ఇప్పుడు చేతినిండా సినిమాలతో యమ బిజీగా ఉన్నారు. బన్నీ ‘పుష్ప’ మూవీతో బిజీగా ఉంటే… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏకంగా మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఎన్టీయార్ ‘ట్రిపుల్ ఆర్’లోనూ, చెర్రీ ‘ట్రిపుల్ ఆర్’తో పాటు ‘ఆచార్య’ షూటింగ్ లోనూ ఉన్నాడు. విజయ్ దేవరకొండ సైతం పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ చేస్తున్నాడు. నాని ‘టక్ జగదీశ్’ అతి త్వరలో జనం ముందుకు రాబోతుండగా, ‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. చిరంజీవి ‘ఆచార్య’ మూవీ చేస్తుంటే, రవితేజ ‘ఖిలాడీ’ని పూర్తి చేసి ‘రామారావు’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Read Also : పాన్ ఇండియా మూవీ లేకుండానే సత్తా చాటిన ప్రిన్స్ మహేశ్!

చిత్రమేమంటే ‘నారప్ప’తో పాటు ‘దృశ్యం -2’ సినిమా చేసిన వెంకటేశ్ కు గానీ, ఈ యేడాది ‘వైల్డ్ డాగ్’లో నటించి, ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ మూవీ చేస్తున్న నాగార్జునకు కానీ, ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ’ను చేస్తున్న బాలకృష్ణకు కానీ టాప్ టెన్ జాబితాలో చోటు దక్కలేదు. పైగా సోషల్ మీడియాలో హల్చల్ చేసే యంగ్ హీరోలకు దక్కిన స్థానాలపైనా చాలామంది అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆర్మాక్స్ మీడియాకు ఉన్న క్రెడిబిలిటీ ఏమిటి అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా సినిమా, టీవీ, ఓటీటీ, న్యూస్, మ్యూజిక్ అండ్ స్పోర్ట్స్ లో ట్రాకింగ్, టెస్టింగ్, ఫోర్ కాస్టింగ్ లను ఎనలైజ్ చేసే కన్సల్టెన్సీగా దీనికి ప్రత్యేకమైన గుర్తింపే ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-