Arvind Kejriwal’s Bail: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. సీబీఐ కేసులోనూ బెయిల్
- అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్..
- బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal’s Bail: మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దొరికింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి రిలీజ్ కాబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. అయితే, న్యాయప్రక్రియలో సుదీర్ఘ కారాగారవాసం అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడమేనని బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ అన్నారు. ‘‘అరెస్టు చేసిన సమయంలో అనేక ప్రశ్నలు, సందేహాలను లేవనెత్తుతోంది. బెయిల్ పొందిన కేజ్రీవాల్‌ను నిరాశపర్చడం కోసమే అరెస్టు చేసినట్టుగా అనిపించింది అన్నారు.
Read Also: Terrorist Arrested: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాది సహాయకుడి అరెస్ట్.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..
Also Read
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ తర్వాత జూన్ నెలలో ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కేసులో ఇప్పటికే ఆయనకు బెయిల్ వచ్చింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. దాదాపు ఆరు నెలల జైలు శిక్ష అనభవించిన తర్వాత ఆయన బయటకు రానుండడంతో ఆప్ నేతలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్‌కు షరతు విధించిన సుప్రీంకోర్టు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!