దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించింది. ఈ తీర్పు చట్ట విరుద్ధం అంటూ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నిరసనలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Gold Import Tariff: ట్రంప్ గుడ్ న్యూస్.. బంగారంపై ఎటువంటి సుంకం ఉండదు.. ధరలు మరింత తగ్గే ఛాన్స్!
తాజాగా సుప్రీంకోర్టు బాటలో రాజస్థాన్ హైకోర్టు కూడా చేరింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్నట్టుగానే హైకోర్టు సీరియస్ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో వీధి కుక్కలను తక్షణమే తీసివేయాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ కుల్దీప్ మాథుర్, జస్టిస్ రవి చిరానియాలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Ayodhya: రామమందిరం చుట్టూ రక్షణ గోడ.. భారీగా బడ్జెట్ కేటాయింపు
వీధి కుక్కలు, ఇతర జంతువులు నగర రోడ్ల నుంచి తొలగించాలని మున్సిపల్ సంస్థలకు ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించింది. శారీరిక హాని కలగకుండా షెల్టర్టకు తరలించాలని కోర్టు ఆదేశించింది. వీధి కుక్కలు, జంతువుల కారణంగా మనుషులు ప్రాణాలు పోతున్నాయని.. మనుషుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఎవరైనా తొలగింపు కార్యక్రమాలు అడ్డుకుంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.
‘‘మున్సిపాలిటీల ఉద్యోగులు… రోడ్లు/కాలనీలు/ప్రజా మార్గాల నుంచి వీధి జంతువులను తొలగించడంలో తమ విధులను నిర్వర్తించకుండా వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం అడ్డుకుంటే..మున్సిపల్ అధికారులు/ఉద్యోగులు సంబంధిత మున్సిపల్ చట్టాల ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించకుండా ఆటంకం కలిగించినందుకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయొచ్చు.’’ అని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది.
ఢిల్లీ వీధుల నుంచి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకించారు. సోమవారం ఇండియా గేట్ దగ్గర ధర్నా చేపట్టారు. ఇక ఈ తీర్పును కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ కూడా తప్పుపట్టారు. ఒక వ్యక్తి కోపంతో తీసుకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. దీనిపై జంతు ప్రేమికులు ఏమంటారో చూడాలి.