Supreme Court: మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఉపశమనం కలిగించింది. 2022లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) రిక్రూట్‌మెంట్ కోసం అదనపు పోస్టుల సృష్టిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్న కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు (ఏప్రిల్ 8న) రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విద్యా శాఖ అవసరమైన సంప్రదింపులతో పాటు గవర్నర్ ఆమోదంతో మాత్రమే అదనపు పోస్టులను సృష్టించినందున న్యాయపరమైన జోక్యం అవసరం లేదని తెలిపింది.
Read Also: Brahma Kumaris Chief: బ్రహ్మకుమారిస్ చీఫ్ దాది రతన్ మోహని కన్నుమూత..
అయితే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్‌మెంట్ కోసం అదనపు పోస్టులను సృష్టించడం “చట్టబద్ధం కాదు” అని కలకత్తా హైకోర్టు తెలిపింది. ఈ నిర్ణయానికి సంబంధించి ప్రశ్నించడానికి మంత్రివర్గ సభ్యులను కస్టడీలోకి తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించింది. కాగా, సీబీఐ దర్యాప్తుకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది.