Sukesh Chandrasekhar Proposed Me In Jail Says TV Actress Chahat Khanna: రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కాన్‌మ్యాన్ సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే! ఈ కేసులో అతనితో పాటు బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహిలపై విచారణ సాగుతోంది. రీసెంట్‌గానే ఆ ఇద్దరు హీరోయిన్లు తమ వాంగ్మూలాల్లో సుకేశ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని మోసం చేసి సుకేశ్ ట్రాప్ చేశాడని జాక్వెలిన్ పేర్కొంటే.. తనని ట్రాప్ చేసేందుకు సుకేశ్ చాలా ప్రయత్నాలు చేశాడని నోరా బాంబ్ పేల్చింది. ఇప్పుడు వీరి సరసన లేటెస్ట్‌గా టీవీ నటి చాహత్ ఖన్నా చేరింది. సుకేశ్ తనని ట్రాప్ చేసి, జైలుకి పిలిపించుకొని, తనని మోకాళ్లపై నిల్చొని ప్రపోజ్ చేశాడని కుండబద్దలు కొట్టింది. తనకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారని చెప్పినా.. ‘నీ భర్త నీకు సరైన వ్యక్తి కాదు’ అని చెప్పాడని పేర్కొంది.
Justice for SI-Constable: ఛలో డీజీపీ’ ముట్టడిలో పోలీసుల లాఠీ ఛార్జ్.. బండి సంజయ్ సీరియస్
చాహత్ ఖన్నా మాట్లాడుతూ.. ‘‘సుకేశ్ తనని తాను ఓ ప్రముఖ దక్షిణ భారత టీవీ ఛానెల్ యజమాని అని, అలాగే జయలలిత మేనల్లుడు అని పరిచయం చేసుకున్నాడు. నాకు వీరాభిమానినని, నా టీవీ షో ‘బడే అచ్చే లాగ్తే హై’ని చూశానని సుకేశ్ తెలిపాడు. నన్ను కలవాలనుకుంటున్నానని అతడు కబురు పంపాడు. దాంతో నేను కంగారుపడ్డాను. అంత పెద్ద వ్యక్తి నుంచి పిలుపు రావడంతో.. ఎందుకు పిలిపించారని ఆందోళన చెందాను. ఏదో ఈవెంట్ ఉందనుకొని.. ఆరు నెలల పాపని ఇంట్లో వదిలేసి మరీ వెళ్లాను. సుకేశ్‌ని జైల్లో కలిసినప్పుడు ఇదే విషయం చెప్పాను. ఈలోపే అతడు మోకాలిపై కూర్చొని, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెప్పాడు. అప్పుడు నాకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఆ షాక్‌లో గట్టిగా అరిచేశాను. నాకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారని చెప్పాను. కానీ, నా భర్త నాకు సరైన వ్యక్తి కాదని, నా పిల్లలకు తండ్రి మాత్రమే అవుతాడని సుకేశ్ చెప్పాడు. నేను ఆందోళనలో ఏడవడం మొదలుపెట్టాను’’ అంటూ చెప్పుకొచ్చింది. సుకేశ్‌ని జైల్లో కలిసినప్పుడు అతడు ఫ్యాన్సీ షర్ట్, బంగారు గొలుసు ధరించి ఉన్నాడని చాహత్ పేర్కొంది. ట్విస్ట్ ఏమిటంటే.. జైలులో సుకేశ్‌ని కలిసిన పాపానికి.. చాహత్‌కి కూడా ఈ కేసులో సమన్లు అందాయి.
Tollywood Progress Report: జనవరిలో వీరయ్య వీరంగం! వీరసింహ గర్జన!!