ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు. ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. గతేడాది అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే సుచిర్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ వాదనను అతడి తల్లిదండ్రులు తోసిపుచ్చారు. కచ్చితంగా ఇదే హత్యేనని వాదించారు.
చాట్‌జీపీటీ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ (26) కేసును అమెరికా పోలీసులు క్లోజ్ చేశారు. సుచిర్ బాలాజీది హత్య కాదని.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు.